...
...
Next Story

మీ ఇంట ఎప్పుడూ సిరిసంపదలు ఉండాలా? ఈ మూడు అలవాట్లు మార్చుకోండి!

2 సెప్టెంబర్ 2026: ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుందో తెలుసా? ఏ తప్పులు చేస్తే సిరిసంపదలు దూరమవుతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

Published on: Sep 2, 2026, 09:30:58 IST
Advertisement

ఆచార్య చాణక్యుని భారతీయ చరిత్రలో అత్య గొప్ప అర్థశాస్త్రవేత్తగా, దూరదృష్టి గల నీతిజ్ఞుడిగా కొలుస్తారు. తన అసాధారణ రాజకీయ చతురతతో సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేసిన ఘనత ఆయనది. శతాబ్దాలు గడిచినా, నేటి ఆధునిక కాలంలోనూ చాణక్య నీతులు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ధన సంపాదన, కుటుంబ నిర్వహణ, సంపద నిలకడ గురించి ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ ఇంట ఎప్పుడూ సిరిసంపదలు ఉండాలా? ఈ మూడు అలవాట్లు మార్చుకోండి!
మీ ఇంట ఎప్పుడూ సిరిసంపదలు ఉండాలా? ఈ మూడు అలవాట్లు మార్చుకోండి!

లక్ష్మీదేవి ఎంతో చంచలమైనదానిగా చెబుతారు. అంటే ఆమె ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదనే అంటారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన వాతావరణం, సత్ప్రవర్తన ఉన్న ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. ఆ అదృష్టకరమైన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విద్వాంసులకు గౌరవం - మూర్ఖులకు తావు లేదు

ఓ ప్రసిద్ధ శ్లోకం ప్రకారం, ఏ సమాజంలో లేదా కుటుంబంలో మూర్ఖులను, అర్హత లేనివారిని తలకెక్కించుకోరో, ఎక్కడ విద్వాంసులు, జ్ఞానుల మాటలకు విలువ ఇస్తారో అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. మంచి చెడులను బేరీజు వేయలేని వారిని ప్రోత్సహించని చోట లక్ష్మీదేవి స్వయంగా అడుగుపెడుతుంది.

అన్నపూర్ణను గౌరవించడం

చాణక్య ప్రకారం, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. ఏ ఇంట్లో అయితే ధాన్యాన్ని భద్రంగా దాచుకుంటారో, అన్నాన్ని దైవంతో సమానంగా భావించి గౌరవిస్తారో ఆ ఇంట దరిద్రం దరిచేరదు. ఆహారాన్ని అవమానించే చోట సిరిసంపదలు ఆవిరైపోతాయి.

అన్యోన్య కుటుంబ జీవితం

భార్యాభర్తల మధ్య సఖ్యత లేని కుటుంబంలో ఎప్పుడూ అశాంతి తాండవిస్తుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, పరస్పర కలహాలు ఉంటాయో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెంటనే నిష్క్రమిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రశాంతత ఉన్న ఇళ్లే దేవతలు నివసించే నిజమైన ఆలయాలు.

లక్ష్మీదేవి ఎందుకు ఆగ్రహిస్తుంది?

అపరిశుభ్రత, బద్ధకం: ఎవరైతే ఎప్పుడూ మురికి బట్టలు వేసుకుంటారో, దంతాల శుభ్రత పాటించరో, సూర్యోదయమైన తర్వాత కూడా నిద్రలేవరో వారిపై లక్ష్మీదేవికి ఎప్పుడూ ఆగ్రహమే ఉంటుంది. ఎంతటి విద్వాంసుడైనా ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

కఠినమైన మాటలు: తోటివారిని ఎల్లప్పుడూ అవమానించేలా మాట్లాడేవారు, అహంకారంతో ప్రవర్తించేవారి దగ్గర ధనం ఎక్కువ కాలం నిలవదు. మధురమైన మాటలు లేని చోట సంపద కరిగిపోతుంది.

అధర్మ మార్గంలో సంపాదన: మోసం, దగా, ఇతరులను కష్టపెట్టి సంపాదించిన సొమ్ము ఎవరికీ శాశ్వతంగా మిగల్లేదు. ఆ అధర్మపు ధనమే చివరికి మనిషి సర్వనాశనానికి దారితీస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe