Chanakya Niti : చాణక్య నీతి.. మీలోని ఈ గుణాలే విజయానికి మార్గదర్శకాలు!

Chanakya Niti : మనం పాటించే కొన్ని విషయాలే మనల్ని విజయం వైపునకు అడుగులు వేసేలా చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం.. సక్సెస్ అవ్వడానికి పాటించాల్సిన విషయాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 31, 2026, 19:06:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒక వ్యక్తి విజయం సాధించడానికి అతని కృషి మాత్రమే కాకుండా కొన్ని లక్షణాలు కూడా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనం విజయం సాధించాలంటే కింద చెప్పే లక్షణాలన్నీ మనలో తప్పక ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుని కొన్ని సూత్రాలను పాటిస్తే.. జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. దీని ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని సూత్రాల జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని గుణాలు ఉన్న వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుని ప్రకారం, తన కాలం ఎలా గడుస్తుందో తెలిసినవాడే అత్యంత తెలివైనవాడు. అతను విజయం సాధించగలడు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, దానికి అనుగుణంగానే ప్రవర్తించాలని చాణక్యుడు చెప్పాడు. వర్తమానం గురించి జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుంది.

ఆచార్య చాణక్యుని ప్రకారం, విజయం సాధించిన వ్యక్తి తన నిజమైన స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. అదే సమయంలో స్నేహితుల మధ్య దాగి ఉన్న శత్రువు ఎవరో, అతడిని ఎలా గుర్తించాలో కూడా తెలుసుకోవాలి. అప్పుడే వైఫల్యాన్ని అధిగమించి విజయం సాధించగలరు.

ఒక వ్యక్తి తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలుసుకోవాలి. ఉద్యోగం ఏమిటి? ఎక్కడ నివసిస్తున్నాడు? పరిస్థితులు ఎలా ఉన్నాయి? పనిచేస్తున్న కార్యాలయంలో ఉద్యోగులు ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిసిన వ్యక్తే విజయవంతమైన వ్యక్తి అవుతాడు. ఎందుకంటే పనిచేసే చోటు గురించి పూర్తిగా అవగాహన ఉంటే విజయం సాధిస్తారు.

చాణక్యుని ప్రకారం, ఒక వివేకి తన ఆదాయ వ్యయాల గురించి సరైన సమాచారం కలిగి ఉండాలి. తెలివిగా ఖర్చు చేయగలగాలి. అలాగే తన వద్ద ఉన్న డబ్బును సరైన సమయంలో పెట్టుబడి పెట్టే జ్ఞానం కూడా కలిగి ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు.

చాణక్య నీతి ప్రకారం, ఒక విజయవంతమైన వ్యక్తి తన స్నేహితులు, సంస్థ లేదా పై అధికారి గురించి తెలుసుకోవాలి. వారు మీ నుండి ఏం కోరుకుంటున్నారో గ్రహించి దానికి అనుగుణంగా పనిచేయాలి. దాని నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అప్పుడే మీ అడుగులు విజయం వైపు పడతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More