నక్షత్రం మారనున్న అంగారకుడు - సెప్టెంబర్ 2 నుంచి ఈ 5 రాశులకు రాజయోగం..! లక్ష్మీదేవి అనుగ్రహం
సెప్టెంబర్ 2న అంగారకుడు పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. గురుడి ప్రభావంతో ఈ 5 రాశుల వారికి అపారమైన ధనయోగం, కెరీర్‌లో విజయం, పదోన్నతులు లభించనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర పరివర్తనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల సేనాధిపతిగా భావించే అంగారకుడు (కుజుడు) 2026 సెప్టెంబర్ 2, బుధవారం రోజున తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ఇప్పటివరకు ఆర్ద్ర నక్షత్రంలో సంచరించిన కుజుడు, సెప్టెంబర్ 2న దేవగురు బృహస్పతి అధిపతిగా ఉన్న 'పునర్వసు' నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 24 వరకు అంగారకుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.

ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం….. పునర్వసు నక్షత్రానికి అధిపతి దేవగురు బృహస్పతి కావడం వల్ల, అంగారకుడు కొన్ని రోజుల పాటు గురుడి ప్రత్యక్ష ప్రభావంలో ఉంటాడు. వేద జ్యోతిష్యంలో అంగారకుడు, బృహస్పతి పరస్పర మిత్ర గ్రహాలు. వీరి కలయిక లేదా పరస్పర ప్రభావం వల్ల జాతకులకు విశేష ధైర్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అనూహ్యమైన శక్తి లభిస్తాయి. అంగారక నక్షత్ర మార్పు కారణంగా ఏ ఏ రాశుల వారికి భూమి, సంపద, లక్ష్మీదేవి అనుగ్రహం లభించనున్నాయో వివరంగా చూద్దాం.
1. మేష రాశి :
అంగారకుడి నక్షత్ర పరివర్తనం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. మేష రాశికి అధిపతి అంగారకుడే కావడం ఇక్కడ విశేషం. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి వేగంగా పుంజుకుంటుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ ప్రతిభతో పెద్ద విజయాలు సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
2. కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రంలో కుజుడి సంచారం విశేష ఫలితాలను ఇస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, దానికి తోడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్తగా ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. సహోద్యోగుల మద్దతుతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు.
3. వృశ్చిక రాశి :
కుజుడి నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారికి తిరుగులేని విజయాలను అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది శ్రేష్ఠమైన సమయం. అదృష్టం తోడై అకస్మాత్తుగా డబ్బు అందుతుంది. నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి (ప్రమోషన్), జీతం పెంపు లభించే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు, శత్రువులపై పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
4. ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో మిత్రుల సహకారంతో మంచి ప్రగతి సాధిస్తారు. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ సమసిపోతాయి. పాత పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు, మద్దతు ఎల్లప్పుడూ ఉంటాయి.
5. మీన రాశి :
మీన రాశి వారు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కొత్త దారులు తెరుచుకుంటాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. పాత రుణాల నుంచి ఉపశమనం లభించి ఊపిరి పీల్చుకుంటారు. కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరిగి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు నమోదవుతాయి. విదేశీ ప్రయాణాలకు ఎదురుచూస్తున్న వారికి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

