పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు
నిజాయితీకి మారుపేరు.. డిసెంబర్లో పుట్టినవారిలో ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.. అందరి మనసు గెలుచుకుంటారు!
డిసెంబర్ నెలలో జన్మించిన వారిలో నిజాయితీ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, వివేకం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని జ్యోతిష్య, వ్యక్తిత్వ విశ్లేషణలు చెబుతాయి. పెద్ద కలలు కనడం, వాటిని సాధించేందుకు కష్టపడటం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వీరి ప్రత్యేకతలు.
పుట్టిన నెలను బట్టి మనిషి ఆలోచనా తీరు, మాటతీరు, వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత అంచనా వేయవచ్చు. డిసెంబర్ నెలలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. అవే వారిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడతాయి. తమ ఆలోచనలు, ప్రవర్తన, పని చేసే పద్ధతితో వీరు సులువుగా అందరి మనసు గెలుచుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారి రాశులు ధనుస్సు, మకర రాశులు అవ్వచ్చు. అందుకే వీరి జీవితంలో గురువు, శని గ్రహాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ రెండు గ్రహాల వల్ల డిసెంబర్లో పుట్టిన వారిలో వివేకం, క్రమశిక్షణ బాగా కనిపిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన నెల, జాతకం, రాశుల స్వభావంపై పాఠకులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఏడాది ముగింపు వేళ వచ్చే ఈ నెలలో జన్మించినవారి పట్టుదల, ఆచరణ తీరుపై తరచూ చర్చలు నడుస్తుంటాయి. అయితే సాధారణ అంచనాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి లక్షణాల్లో మార్పులు ఉంటాయి.
నిజాయితీ, పెద్ద కలలు:
డిసెంబర్ నెలలో పుడితే మనసులో ఏదీ దాచుకోకుండా నిజాయితీగా ఉంటారు. ఎంతో విశ్వసనీయంగా వ్యవహరిస్తారు. ప్రతి బంధాన్నీ మనస్ఫూర్తిగా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు చెప్పడం, ఆర్భాటాలు చేయడం వీరికి అస్సలు నచ్చదు. తమ అభిప్రాయాన్ని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఇతరులకు సాయం చేయాల్సి వస్తే ఎప్పుడూ ముందుంటారు. అయితే ఎవరైనా వీరితో మోసపూరితంగా వ్యవహరిస్తే, జీవితంలో మళ్లీ వారి వైపు తిరిగి చూడరు. వీరి మాటల్లోని స్పష్టత కొందరికి ఇబ్బంది కలిగించినా, నిజమైన స్నేహితులు, ఆత్మీయులే వీరి జీవితంలో నిలుస్తారు.
పెద్ద కలలు, పట్టుదల:
డిసెంబర్లో జన్మించిన వారిలో పెద్ద కలలు కనడానికి ఎటువంటి భయం ఉండదు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే తపనతో ఉంటారు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వీరిలో కనిపిస్తుంది. సొంత ప్రతిభపై నమ్మకంతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా కష్టపడి పని చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. క్లిష్ట సమయాల్లోనూ అంత సులువుగా చేతులెత్తేయరు. వీరిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది.
ఆహ్లాదకర స్వభావం.. కోపంతో ముప్పు
కలివిడితనం, ప్రయాణాలు: డిసెంబర్లో పుట్టినవారికి కొత్త వ్యక్తులతో కలవడం ఇష్టం. ప్రయాణాలు చేయాలనే ఆసక్తి కూడా ఎక్కువే ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందంగా ఉంచడం వీరి ప్రత్యేకత. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. బంధాలను సమతుల్యతతో చక్కదిద్దుకుంటారు.
కోపం వల్ల ఇబ్బందులు: డిసెంబర్లో పుట్టిన వారికి అతిపెద్ద బలహీనత వారి కోపం. తమ మనసులో ఉన్న మాటను వెంటనే చెప్పేయాలని తపిస్తారు, చాలా సార్లు ఆ మాటలు కోపంలోనే బయటకు వస్తాయి. ఏదైనా అనే ముందు బాగా ఆలోచించరు. ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోకుండానే కొన్ని మాటలు అనేస్తారు. దానివల్ల పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉంది. అలా బంధాల్లో అపార్థాలు పెరుగుతాయి.
డిసెంబర్లో పుట్టినవారిలో గురు-శని ప్రభావంతో వివేకం, కృషి, నిజాయితీ నిండుగా ఉంటాయి. మాటల్లో సంయమనం, కోపంపై నియంత్రణ పాటిస్తే బంధాలను, విజయాలను మరింత నిలబెట్టుకోగలరు.

E-Paper
