...
...
Next Story

Detailed Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. జూలై 6 నుండి 12 వరకు.. మీ అదృష్టం ఎలా ఉందంటే!

జులై నెల రెండో వారంలో గ్రహాల సంచారం పలు రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ వారం కొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తే, మరికొందరు ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Published on: Jul 5, 2026, 11:52:18 IST
Advertisement

జులై నెల రెండో వారంలోకి అడుగుపెట్టాం. గ్రహాల గమనం మరియు స్థితుల ఆధారంగా ఈ ఏడు రోజులు పన్నెండు రాశుల వారికి ఏయే రంగాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

Detailed Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. జూలై 6 నుండి 12 వరకు.. మీ అదృష్టం ఎలా ఉందంటే! (pinterest)
Detailed Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. జూలై 6 నుండి 12 వరకు.. మీ అదృష్టం ఎలా ఉందంటే! (pinterest)

మేష రాశి: రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం పరంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా, చిన్నపాటి సమస్యలు రావచ్చు. కెరీర్, ప్రేమ వ్యవహారాల్లో ఎదుగుదల కనిపిస్తుంది. వారాంతం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే, వారం మధ్యలో అనవసర ఖర్చులు, ప్రయాణాల్లో ఇబ్బందులు రావచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం.

వృషభ రాశి: ఈ రాశి వారికి రాజకీయ లాభాలు, తండ్రి మద్దతు తోడుగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఇది అద్భుతమైన సమయం. మీ కోపం వల్ల నిర్ణయాలు తప్పుగా మారే ప్రమాదం ఉంది. రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలపై నిఘా అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. రాగి వస్తువులను దానం చేయడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారికి ధనధాన్యాలకు లోటు లేదు. వాక్చాతుర్యంతో పనులు పూర్తి చేస్తారు. గొంతు, చెవి సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వారం ఆరంభంలో అవమానాలు జరిగే సూచనలు ఉన్నాయి, ప్రయాణాలు వాయిదా వేయండి. కాళీ మాతను ప్రార్థించడం ద్వారా శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి: వ్యాపారం, ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉన్నాయి. కొత్త వనరులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. అయితే, తండ్రితో విభేదాలు లేదా అధికారుల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. వారం ఆరంభంలో గాయాలు అయ్యే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ధర్మకార్యాల్లో అతిగా వ్యవహరించకండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరిగినా, మీరు వాటన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు వారాంతంలో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు. శనిదేవుడిని స్మరించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

తులా రాశి: తులా రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయండి. మిత్రుల సహాయంతో ఆర్థిక స్థితి పుంజుకుంటుంది. వారం ఆరంభంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.

వృశ్చిక రాశి: ఆరోగ్యం బాగుంటుంది, వృత్తిపరంగా లాభాలు ఉన్నాయి. పాత పెట్టుబడులు ఈ వారం మంచి లాభాలను ఇస్తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే వాదనలు పెట్టుకోకండి. నల్లని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం.

ధనస్సు రాశి: రాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త పనులు చేపట్టే ముందు ఆలోచించండి. వారాంతంలో నిలిచిపోయిన పాత బాకీలు చేతికి అందుతాయి. గొంతు, చెవి సంబంధిత సమస్యలు రావచ్చు. మినపప్పు దానం చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

మకర రాశి: కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నోరు, దంతాల విషయంలో జాగ్రత్త వహించండి. శివలింగానికి జలాభిషేకం చేయడం మంచిది.

కుంభ రాశి: కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, పనిలో సహాయపడతాయి. వారాంతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మనసు ఆందోళనగా ఉంటుంది, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అమ్మవారిని స్మరించడం వల్ల మంచి జరుగుతుంది.

మీన రాశి: ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో కెరీర్ పరంగా మంచి వార్తలు వింటారు. తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తవచ్చు. గణపతికి గరిక సమర్పించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe