...
...
Next Story

ధన త్రయోదశి రోజు ఏం చేయాలి? ఈ 4 వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

హిందూ సంప్రదాయంలో దీపావళి వేడుకలకు ప్రారంభ సూచికగా ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ పక్ష త్రయోదశి రోజున వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవానుడు అమృత కలశం, ఆయుర్వేద విజ్ఞానంతో ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి.

Published on: Nov 6, 2026, 08:01:06 IST
Advertisement

హిందూ సంప్రదాయంలో దీపావళి వేడుకలకు అంకురార్పణ పలికే పవిత్ర పర్వదినం ధనత్రయోదశి. ఆశ్వయుజ కృష్ణ పక్ష త్రయోదశి తిథి రోజున ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సముద్ర మథన సమయంలో ఇదే రోజున విష్ణుమూర్తి అంశావతారమైన భగవాన్ ధన్వంతరి తన చేతిలో అమృత కలశంతో పాటు ఆయుర్వేద విజ్ఞానాన్ని తీసుకుని ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి ప్రతీకగానే ప్రతిఏటా ధన త్రయోదశి నాడు కొత్త వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది.

ధన త్రయోదశి రోజు ఏం చేయాలి? ఈ 4 వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!
ధన త్రయోదశి రోజు ఏం చేయాలి? ఈ 4 వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

ధన్వంతరి భగవానుడి ప్రాదుర్భావం తర్వాత దేవతలు ఆయన పూజలో ధనియాలను ఉపయోగించారని ప్రతీతి. అందుకే ఈ పర్వదినాన పూజా సమయంలో లక్ష్మీదేవి, ధన్వంతరి చరణాల వద్ద ధనియాలను సమర్పించి, వాటిని భద్రంగా ఉంచుకుంటారు. కొందరు భక్తులు ఆ ధనియాలను మట్టిలో విత్తనాలుగా నాటుతారు.

ప్రకృతి ఒక చిన్న గింజను వందల కొద్దీ ధాన్యపు గింజలుగా ఎలా మారుస్తుందో, అలాగే భగవానుడు తమ సంపదను అనేక రెట్లు వృద్ధి చేస్తాడనే గట్టి నమ్మకం దీని వెనుక ఉంది. దేవతల వైద్యుడిగా, ఆరోగ్య ప్రదాతగా కీర్తించబడే ధన్వంతరికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి దీర్ఘాయువును ప్రసాదించమని కోరుకుంటారు.

చీపురు కొనుగోలు వెనుక ఉన్న ఆచారాలు

ధనత్రయోదశి రోజున కేవలం బంగారం, వెండి మాత్రమే కాకుండా కొత్త చీపురు కొనుగోలు చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మత్స్య పురాణం ప్రకారం చీపురులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. ఇది ఇళ్లలోని మురికిని శుభ్రం చేయడమే కాకుండా దరిద్య్రాన్ని, వ్యతిరేక శక్తిని తరిమికొడుతుంది. నూతనంగా కొనుగోలు చేసిన చీపురును పూజ గదిలో నేలపై పడుకోబెట్టి ఉంచాలి.

పురాణ కథల ప్రకారం రాజా బలి చక్రవర్తి వామనుడికి సమస్తాన్ని దానం చేసిన తర్వాత, దేవతలు తాము కోల్పోయిన సంపదను తిరిగి పొందారు. దీనికి కృతజ్ఞతగా దేవతలు విష్ణువును, ఆయన వామన రూపాన్ని ఆరాధించారు.

ఈ పర్వదినం ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సౌకర్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ధనత్రయోదశి రోజున ధన్వంతరితో పాటు లక్ష్మీదేవి, కుబేరుడు మరియు యమధర్మరాజును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవి సంపదను ప్రసాదిస్తే, కుబేరుడు ఆ సంపదను కాపాడతాడు. ఇక యమధర్మరాజు అకాల మృత్యువు నుంచి మనలను రక్షిస్తాడని నమ్ముతారు.

ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఇంటి ప్రధాన గుమ్మం వద్ద పదమూడు దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు అకాల మృత్యు భయం తొలగిపోవడానికి యమరాజ నిమిత్తం దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి ఉంచుతారు. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదనే కఠినమైన ఆచారం ఉంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks