ధన త్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది. ఐదు రోజులు పాటు దీపావళి పండుగను జరుపుతారు. అందులో మొదటిది ధన త్రయోదశి. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కలగాలని భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తారు. అదే విధంగా ధన త్రయోదశి సాయంత్రం యమదీపాన్ని పెడతారు. ధన త్రయోదశి చాలా శుభదినం. ఆ రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకువస్తే సకల శుభాలు కలుగుతాయి. అదృష్టం కూడా ఎక్కువవుతుంది, సంపదకు లోటు ఉండదు.
ధన త్రయోదశి 2025

ప్రతి ఏటా అశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుతారు. ఈసారి అక్టోబర్ 18న ధన త్రయోదశి వచ్చింది. ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు రావడం వలన సకల శుభాలు కలుగుతాయి. అలాగే ధన త్రయోదశి నాడు కొన్ని వస్తువులను తీసుకు రాకుండా చూసుకోవాలి. మరి ధన త్రయోదశి రోజు ఏం తీసుకు వస్తే మంచి జరుగుతుంది? వేటిని తీసుకు రావడం వలన అశుభ ఫలితాలను ఎదుర్కోవాలి. ఇప్పుడే తెలుసుకుందాం.
ధన త్రయోదశి నాడు శుభ ఫలితాల కోసం వీటిని కొనుగోలు చేయండి
1.బంగారం, వెండి
బంగారం, వెండి చాలా ఖరీదైనవి. ధన త్రయోదశి నాడు కుదిరితే వీటిని ఇంటికి తీసుకురావడం వలన శుభఫలితాలు ఎదురవుతాయి. బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చాలా మంది బంగారం, వెండి కాయిన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆభరణాలు, వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విధంగా బంగారం, వెండి ధన త్రయోదశి నాడు కొని ఇంటికి తీసుకురావడం వలన సకల శుభాలు కలుగుతాయి, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
2.కొత్త సామాన్లు
ఇత్తడి, స్టీల్ సామాన్లను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మంచి ఫలితం ఎదురవుతుంది. సంపద పెరుగుతుంది. వంటింట్లో ఉపయోగించే సామాన్లను, డైనింగ్ సెట్లను ఈరోజు తీసుకురావడం వలన అదృష్టం పెరుగుతుంది. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి నుంచి బయటపడవచ్చు.
3.లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు
{{/usCountry}}ఇత్తడి, స్టీల్ సామాన్లను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మంచి ఫలితం ఎదురవుతుంది. సంపద పెరుగుతుంది. వంటింట్లో ఉపయోగించే సామాన్లను, డైనింగ్ సెట్లను ఈరోజు తీసుకురావడం వలన అదృష్టం పెరుగుతుంది. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి నుంచి బయటపడవచ్చు.
3.లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు
{{/usCountry}}ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయడం వలన మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. వీటిని కొనుగోలు చేసి పూజగదిలో పెడితే మంచి జరుగుతుంది. సానుకూల శక్తి కలుగుతుంది, మంచి ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
4.ధనియాలు, ఉప్పు
ధన త్రయోదశి నాడు ధనియాలు, ఉప్పు కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ రెండింటిని ఇంటికి తీసుకురావడం వలన ఇంట్లో తాజాదనం ఉంటుంది, సంపద పెరుగుతుంది. ఇంటికి ఉప్పు తీసుకురావడం వలన దుష్టశక్తుల నుంచి బయటపడవచ్చు.
5.కొత్త బట్టలు
ధన త్రయోదశి నాడు ఇంటికి కొత్త బట్టలు తీసుకురావడం వలన కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతారు. కొత్త వస్త్రాలను ఇంటికి తీసుకురావడం వలన అదృష్టం, సంతోషం కూడా పెరుగుతాయి. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
ధన త్రయోదశి నాడు వీటిని తీసుకురావద్దు
ధన త్రయోదశి నాడు పొరపాటున కూడా కొన్నిటిని కొనుగోలు చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
1.పదునైన వస్తువులు
ధన త్రయోదశి నాడు పదునైన వస్తువులను కొనుగోలు చేసి తీసుకురావడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కత్తులు, కత్తెరలు వంటి వాటిని తీసుకురాకూడదు.
2.ఇనుము వస్తువులు
ధన త్రయోదశినాడు ఇనుము వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని కొనడం, ఇంటికి తీసుకురావడం మానుకోవాలి.
3.విరిగిపోయిన సామాన్లు
ధన త్రయోదశి నాడు విరిగిపోయిన సామాన్లు, పగిలిన వస్తువులు, చిరిగిపోయిన బట్టలు వంటి వాటిని తీసుకురాకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగించి, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.