హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ ప్రత్యేకమైన పండుగను కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటాము. ఈ ఏడాది అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు లక్ష్మీ పూజ ముహూర్తం వివరాలను కూడా తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, దీపావళి నాడు లక్ష్మీదేవి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శక్తి స్వరూపిణి అయిన కాళీమాతను కూడా ఆరాధించడం జరుగుతుంది. దీపావళి రోజు శుభ ముహూర్తంలో పూజలు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్ముతారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది? అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే వివరాలను పూర్తిగా చూసేద్దాం.
దీపావళి 2026 తేదీ, సమయం పూర్తి వివరాలు
ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటాము. పంచాంగం ప్రకారం, నవంబర్ 8 ఉదయం 11:27 గంటలకు అమావాస్య తిథి మొదలవుతోంది. నవంబర్ 9 మధ్యాహ్నం 12:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక, నవంబర్ 8, ఆదివారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి.
దీపావళి 2026 శుభ ముహూర్తం వివరాలు
పంచాంగం ప్రకారం, నవంబర్ 8న ప్రదోష కాల సమయం సాయంత్రం 5:07 గంటల నుంచి రాత్రి 7:41 గంటల వరకు ఉంటుంది. వృషభ కాలం సాయంత్రం 5:31 గంటల నుంచి రాత్రి 7:29 గంటల వరకు ఉంటుంది. నిశీథ కాలం రాత్రి 11:07 గంటల నుంచి 11:58 గంటల వరకు ఉంటుంది. ఈ సమయాల్లో లక్ష్మీదేవిని ఆరాధించడానికి అనుకూలంగా ఉంటుంది.
దీపావళి నాడు ప్రదోష కాలం, వృషభ కాలం ప్రాముఖ్యత
{{/usCountry}}దీపావళి నాడు ప్రదోష కాలం, వృషభ కాలం ప్రాముఖ్యత
{{/usCountry}}దీపావళి నాడు లక్ష్మీదేవి పూజను ప్రదోష కాలం, వృషభ కాలంలో జరపడం అత్యంత అనుకూలమైనది. సూర్యాస్తమయం అయ్యాక ప్రదోష కాలంలో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు.
లక్ష్మీ పూజ ముహూర్తం
లక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఈ సమయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం నాడు దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది.
పూజ ప్రారంభ సమయం: సాయంత్రం 5:31 గంటలు.
పూజ ముగింపు సమయం: రాత్రి 7:29 గంటలు.
ఈ ఒక గంట 58 నిమిషాల సమయం లక్ష్మీదేవి పూజకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అలాగే, రాత్రి 11:07 గంటల నుంచి 11:58 గంటల వరకు నిశీథ కాలం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు.
దీపావళి నాడు పాటించాల్సిన సులువైన పరిహారాలు
1. లక్ష్మీదేవికి దీపారాధన
దీపావళి నాడు సాయంత్రం ఇల్లు శుభ్రంగా చేసుకున్నాక లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయండి. ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
2. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలు
దీపావళి రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులు వేసి, అందంగా అలంకరించి దీపాలు వెలిగించండి. ఇది సానుకూలతను పెంచుతుందని విశ్వసిస్తారు.
3. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలు
దీపావళి నాడు లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలను సమర్పించండి. పండ్లను నైవేద్యంగా సమర్పించండి.
4. పేదలకు అన్నదానం
దీపావళి నాడు శక్తి కొద్దీ దానాలు చేయడం మంచిది. దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
5. లక్ష్మీ గణేశ పూజ
దీపావళి నాడు లక్ష్మీ గణపతి పూజ చేయడం మంచిది. అలాగే, “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని కూడా జపించండి.