...
...
Next Story

దీపావళికి కొత్త కారు కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు వాహనం కొనాలో తెలుసుకోండి!

హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు, గృహోపకరణాలు, కొత్త కార్లు, వాహనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శుభ ముహూర్తంలో కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు.

Published on: Nov 3, 2026, 14:01:17 IST
Advertisement

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి షాపింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీపావళి సమయంలో చాలా మంది వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడంతో పాటుగా గృహోపకరణ వస్తువులు, కొత్త కార్లు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

దీపావళికి కొత్త కారు కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు వాహనం కొనాలో తెలుసుకోండి! (AI)
దీపావళికి కొత్త కారు కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు వాహనం కొనాలో తెలుసుకోండి! (AI)

దీపావళి నాడు లేదా పండుగకు ముందు, తర్వాత శుభ ముహూర్తంలో వస్తువులను ఇంటికి తీసుకువస్తే అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. సంతోషం, ఐశ్వర్యం రెట్టింపు అవుతాయి. జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు రంగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాశికి తగ్గట్టుగా వాహనాలను కొనుగోలు చేయాలి. ఏ రాశి వారు దీపావళికి ఏ రంగు వాహనాలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ రాశికి ఏ రంగు కలిసొస్తుందో ఇప్పుడే చూసేయండి.

మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు రంగు కారు కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు లేదా అదే షేడ్‌లో ఉండే వాహనాలను కొనుగోలు చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

వృషభ రాశి: ఈ రాశి వారు తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. దీపావళికి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ రంగును ప్రిఫర్ చేయండి. ఈ రంగు ప్రశాంతత, సానుకూలతకు సంకేతం.

మిథున రాశి: మిథున రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ రంగు వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.

సింహ రాశి: సింహ రాశి వారు ఎరుపు లేదా చాక్లెట్ రంగు కారును కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రంగు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీపావళికి ఈ రంగును ప్రిఫర్ చేయడం మంచిది.

కన్యా రాశి: కన్యా రాశి వారికి గ్రే కలర్ కారు బాగా కలిసి వస్తుంది. దీపావళికి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ రంగును ఎంపిక చేసుకోవడం మంచిది.

తులా రాశి: తులా రాశి వారికి సిల్వర్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఈ రంగు వాహనాలను కొనుగోలు చేయడం ఈ రాశి వారికి బాగా ప్రయోజనాలను అందిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చాక్లెట్ రంగు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రంగు సంపద, ఐశ్వర్యాన్ని పెంచుతుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తెలుపు రంగు వాహనాన్ని కొనుగోలు చేయడం మంచిది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి నలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రంగు వారి వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.

మీన రాశి: మీన రాశి వారికి క్రీమ్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ రంగును ప్రిఫర్ చేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks