జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని వాక్చాతుర్యం, వ్యాపారం, మేధస్సు మరియు సంభాషణకు కారకుడిగా భావిస్తారు. ప్రతి రాశి మార్పు లేదా గమనంలో వచ్చే మార్పు మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

ముఖ్యంగా దీపావళి పండుగకు ముందు అక్టోబర్ 24న బుధుడు తులా రాశిలో తిరోగమనంలో ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అనవసర సమస్యలను నివారించవచ్చు.
బుధుడి తిరుగోమనం ప్రభావం ఏమిటి?
అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు బుధుడు వక్ర దశలో ప్రయాణిస్తాడు. ఈ కాలంలో వ్యాపారంలో లెక్కల విషయంలో, కమ్యూనికేషన్‌లో మరియు పత్రాల పరిశీలనలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. పాత నిర్ణయాలను మరోసారి సమీక్షించుకోవడానికి ఈ సమయం సూచిస్తుంది.
మేష రాశి: భాగస్వామ్య వ్యవహారాల్లో సంయమనం
మేష రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ఓపిక చాలా అవసరం. ఎవరితోనైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా పాత చర్చలు జరిగేటప్పుడు నిబంధనలను క్షుణ్ణంగా చదవండి. చిన్నపాటి మనస్పర్థలు వస్తే వివాదాలను పెంచకుండా సామరస్యంగా పరిష్కరించుకోండి.
మిథున రాశి: పత్రాలు, డాక్యుమెంట్ల విషయంలో అప్రమత్తత
మిథున రాశికి బుధుడే అధిపతి కావడం వల్ల ఈ రాశిపై ఈ మార్పు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ మరియు వ్యాపార పత్రాలను చదివేటప్పుడు జాగ్రత్త వహించండి. కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తొందరపాటు వద్దు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కన్యా రాశి: ఆర్థిక లావాదేవీల్లో తగు జాగ్రత్తలు
కన్యా రాశికి కూడా బుధుడే నాథుడు. ఈ గోచార కాలంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి సమాచారం సేకరించడం మంచిది. ముఖ్యంగా ఆఫీస్ పనులు, మెయిల్స్ మరియు అధికారిక పత్రాల విషయంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.
తులా రాశి: పాత విషయాలపై పునరాలోచన
ప్రత్యేకంగా తులా రాశిలోనే బుధుడు వక్రిస్తుండటంతో, గతంలో నిలిచిపోయిన పాత విషయాలు మళ్లీ తెరపైకి రావచ్చు. కెరీర్ లేదా వ్యాపారంలో ఎలాంటి కొత్త ముందడుగు వేసే ముందైనా అన్ని కోణాల్లో ఆలోచించడం ఉత్తమం. కుటుంబంలో లేదా బంధువులతో అపార్ధాలు రాకుండా మీ మాటలను స్పష్టంగా వ్యక్తపరచండి.
{{/usCountry}}ప్రత్యేకంగా తులా రాశిలోనే బుధుడు వక్రిస్తుండటంతో, గతంలో నిలిచిపోయిన పాత విషయాలు మళ్లీ తెరపైకి రావచ్చు. కెరీర్ లేదా వ్యాపారంలో ఎలాంటి కొత్త ముందడుగు వేసే ముందైనా అన్ని కోణాల్లో ఆలోచించడం ఉత్తమం. కుటుంబంలో లేదా బంధువులతో అపార్ధాలు రాకుండా మీ మాటలను స్పష్టంగా వ్యక్తపరచండి.
{{/usCountry}}