శ్రీరామనవమిని చాలా శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈరోజు రాముడిని ప్రత్యేకించి పూజిస్తారు. అలాగే రామనవమి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. శ్రీరాముని ఆలయాల్లో ప్రత్యేకంగా రాముడిని పూజిస్తారు. వీధుల్లో, వాడల్లో రామాలయాలు భక్తులతో కళకళ్ళాడతాయి. శ్రీరామనవమి నాడు ఈ పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయి.
శ్రీరామనవమి 2026

దశరథ రాముడు సకల కళాగుణాభిరాముడు అయినటువంటి శ్రీరాముడు వసంత ఋతువులో, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముడు విష్ణువు అవతారం. ప్రత్యేకంగా శ్రీరామనవమిని జరుపుకుంటాము.
ఈ ఏడాది శ్రీరామనవమి మార్చి 27న వచ్చింది. శ్రీరామనవమి నాడు ఈ పనులు చేస్తే మాత్రం ఎంతో మంచి జరుగుతుంది. రామనవమి వేళ దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలు అన్నీ కూడా మంత్రాలతో, భక్తుల పూజలతో కళకళ్ళాడతాయి. రామజన్మోత్సవాన్ని అన్ని రామాలయాల్లో కూడా జరుపుతారు. ఈ శ్రీరామనవమి వేళ కొన్ని పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏడాది అంతా కూడా కలిసి వస్తుంది. మరి పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరామనవమి వేళ ఖచ్చితంగా ఈ పనులు చేయండి.. ఇక అన్నీ మంచి ఫలితాలే
శ్రీరామనవమి నాడు రామాయణంలో కొన్ని శ్లోకాలను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంది సీతారామ కళ్యాణాన్ని జరిపిస్తారు.
శ్రీరామనవమి నాడు పుత్రకామిష్టి యాగం చేయడం వలన సంతానం లేని వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరాముని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
శ్రీరామనవమి నాడు అక్షింతలను శిరస్సుపై వేసుకుంటే అన్ని విధాలుగా కలిసివచ్చి ఆనందంగా ఉండొచ్చు. రాముడు చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి, పువ్వులు సమర్పించి, రామరక్షా స్తోత్రాన్ని చదివితే అన్నీ శుభ ఫలితాలు కలుగుతాయి.
{{/usCountry}}శ్రీరామనవమి నాడు అక్షింతలను శిరస్సుపై వేసుకుంటే అన్ని విధాలుగా కలిసివచ్చి ఆనందంగా ఉండొచ్చు. రాముడు చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి, పువ్వులు సమర్పించి, రామరక్షా స్తోత్రాన్ని చదివితే అన్నీ శుభ ఫలితాలు కలుగుతాయి.
{{/usCountry}}అలాగే కళ్యాణ మంత్రాలను తప్పక వింటే కూడా శ్రీరామనవమి నాడు శుభ ఫలితాన్ని పొందవచ్చు. ఖచ్చితంగా ఈరోజు వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో అందరూ తీసుకుంటే మంచి జరుగుతుంది.
కళ్యాణం సమయంలో తలంబ్రాలు పోయడం చూస్తే ఆహారానికి లోటు ఉండదు. శ్రీరామనవమి నాడు రామ నామాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఈ విశేషమైన రోజున రాముడికి తులసి దళాలు, సీతమ్మకు మారేడు దళాలు, హనుమంతుడికి తమలపాకులను సమర్పించండి.
కళ్యాణ తలంబ్రాలను దాచిపెట్టి, పెళ్లి సమయంలో వాటిని కలిపితే దాంపత్యంలో లోటు ఉండదు. సీతారాముల ప్రత్యేక అనుగ్రహంతో జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు.
శ్రీరామనవమి రోజు భక్తిశ్రద్ధలతో రామున్ని ఆరాధించి ఉపవాసం ఉంటే మనసుకు శాంతి కలిగి, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. నిరుపేదలకు తోచిన దానం చేస్తే కూడా శ్రీరామనవమి వేళ విశేష ఫలితాలు పొందవచ్చు. హనుమాన్ చాలీసా పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.