శని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి? త్వరలో ఈ 3 రాశులకు శని నుంచి వరాల జల్లు, విపరీతమైన అదృష్టం!
జూలైలో, శని తన నక్షత్ర స్థానాన్ని మారుస్తుంది. శని యొక్క నక్షత్రరాశి యొక్క మార్పు కారణంగా అనేక రాశిచక్రాల యొక్క అదృష్టం ప్రకాశిస్తుంది. శని సంచారం యొక్క అదృష్ట రాశిచక్రాల గురించి తెలుసుకోండి. శని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలో కూడా చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రంలో కర్మ ఫల ప్రదాతగా, న్యాయ దేవతగా శని దేవుడిని కొలుస్తారు. శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి పట్టే సమయం ఎక్కువ కావడంతో, ఆయన గమనం మారినప్పుడల్లా దేశవ్యాప్తంగానూ, వ్యక్తుల జీవితాల్లోనూ పెను మార్పులు సంభవిస్తాయి. తాజాగా 2026 జూలై నెలలో శని దేవుడు తన నక్షత్ర సంచారాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తే, మరికొందరికి ఊహించని ధన లాభాలను తెచ్చిపెట్టనుంది.

నక్షత్ర మార్పు ప్రత్యేకత ఏంటి?
జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూలై 2వ తేదీన శని దేవుడు రేవతి నక్షత్రంలోని రెండో పటంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రంలో శని ఆగస్టు 19 వరకు కొలువై ఉంటాడు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, బుధ గ్రహాల మధ్య మిత్ర భావం ఉంటుంది. మిత్ర క్షేత్ర నక్షత్రంలో శని సంచరించడం వల్ల ఆ ప్రభావం ఎంతో సానుకూలంగా ఉంటుందని పండితులు వివరిస్తున్నారు. ఈ కాలంలో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం వరించి, నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.
అదృష్టం వరించే ఆ మూడు రాశులు ఇవే:
1. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని సంచారం తొమ్మిదో స్థానంలో జరుగుతుంది. దీని వల్ల ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. గతంలో ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉండి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తుంది.
2. కన్యా రాశి
కన్యా రాశి వారికి శని నక్షత్ర మార్పు ఎంతో మేలు చేస్తుంది. శని మీ రాశికి ఏడో స్థానంలో సంచరిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది, దీనివల్ల సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడటమే కాకుండా, మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి.
3. కుంభ రాశి
కుంభ రాశికి శని దేవుడే అధిపతి. అందుకే ఈ రాశి వారిపై శని దేవుడికి ఎప్పుడూ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంతో పాటు అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీ వ్యక్తిత్వంలో స్పష్టమైన మార్పు వస్తుంది, సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
శని దేవుని అనుగ్రహం కోసం సులభమైన మార్గాలు:
శని దేవుడి ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి మన పెద్దలు కొన్ని పరిహారాలు సూచించారు. శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
క్రమం తప్పకుండా శని చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అలాగే నలుపు రంగు దుస్తులు లేదా నల్ల మినుములను దానం చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మకం. పేదలకు సాయం చేయడం, అశక్తులకు తోడ్పాటు అందించడం శని దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పనులు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల విశ్లేషణలు మరియు మతపరమైన నమ్మకాల ఆధారంగా రూపొందించినది. దీనిని ధృవీకరించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


