నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అదే విధంగా, వివిధ స్తోత్రాలను, శ్లోకాలను కూడా చదువుతూ ఉంటారు. దసరా నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీసూక్తం పఠించడం మంచిది.

హిందూ సంప్రదాయాల్లో వీటిని ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను స్తుతిస్తుంది. అలాగే, శ్రీసూక్తం వేదాల్లో ప్రసిద్ధి చెందిన సూక్తం. ఇది మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తుంది.
అష్టలక్ష్మి ఎనిమిది రూపాలను ఈ స్తోత్రంలో చూడొచ్చు
అష్టలక్ష్మి ఎనిమిది రూపాలు కూడా సంపద, ధైర్యం, సంతానం, విద్య, విజయం వంటివి జీవితంలో వివిధ శుభసంపదలకు ప్రతీకలు. ఇవి అష్టలక్ష్ములు.
ఆదిలక్ష్మి: శాంతి, దైవానుగ్రహం కోసం ఆదిలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ధాన్యలక్ష్మి: ఆహార సమృద్ధి, కుటుంబ పోషణ కోసం ధాన్యలక్ష్మిని భక్తితో భక్తులు ఆరాధించడం జరుగుతుంది.
ధైర్యలక్ష్మి: ధైర్యం, కష్టాలు ఎదుర్కొనే శక్తి కలగాలని భక్తులు ధైర్యలక్ష్మిని పూజిస్తారు.
గజలక్ష్మి: గౌరవం, ఐశ్వర్యం కలగాలని, ఎప్పుడూ శ్రేయస్సు ఉండాలని గజలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
సంతానలక్ష్మి: కుటుంబంలో పిల్లలు, సంతానం కలిగి సంతోషంగా ఉండాలని, పిల్లలు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తారు.
విజయలక్ష్మి: చేపట్టే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వాలని, ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ప్రార్థిస్తారు.
విద్యాలక్ష్మి: జ్ఞానం, వివేకం, విద్య కోసం విద్యాలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ధనలక్ష్మి: ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, సంపద, ఆర్థిక శ్రేయస్సు కలగాలని ధనలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ఎనిమిది లక్ష్మీదేవులున్న అష్టలక్ష్మీ స్తోత్రాన్ని ఇంట్లో చదవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ లక్ష్ముల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
శ్రీసూక్తాన్ని ఎందుకు చదవాలి?
దసరా నవరాత్రుల్లో వీలైతే శ్రీసూక్తాన్ని కూడా చదువుకోండి. ఋగ్వేదానికి అనుబంధంగా పరంపరలో ప్రసిద్ధి చెందినది ఈ సూక్తం. శ్రీసూక్తం చదవడం వలన మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభం, ఐశ్వర్యం కలగాలని శ్రీసూక్తాన్ని చాలామంది చదువుతూ ఉంటారు.
{{/usCountry}}దసరా నవరాత్రుల్లో వీలైతే శ్రీసూక్తాన్ని కూడా చదువుకోండి. ఋగ్వేదానికి అనుబంధంగా పరంపరలో ప్రసిద్ధి చెందినది ఈ సూక్తం. శ్రీసూక్తం చదవడం వలన మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభం, ఐశ్వర్యం కలగాలని శ్రీసూక్తాన్ని చాలామంది చదువుతూ ఉంటారు.
{{/usCountry}}శ్రీసూక్త పారాయణం చేస్తే ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ధన సమృద్ధి, జీవన స్థిరత్వం కోసం చాలామంది శ్రీసూక్తాన్ని చదివి అమ్మవారిని పూజిస్తారు. అలాగే, శ్రీసూక్తాన్ని చదవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. లయబద్ధమైన మంత్ర పారాయణం చేస్తే ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది. వేదమంత్రాల అర్థాన్ని తెలుసుకుంటూ పఠిస్తే ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది.