కొత్త అమావాస్య మార్చి 16న, 17న? పూజ గది, దేవుళ్ళను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో చూడండి!
మార్చి 18 అనగా రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యని ఫాల్గుణ అమావాస్య లేదా కొత్త అమావాస్య అని అంటారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. అమావాస్య తిథి ఉదయం 7:40కి ప్రారంభమవుతుంది. మార్చి 19 ఉగాది నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య ఉంటుంది. ఈ రెండు రోజులు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి.
కొత్త అమావాస్య చాలా శక్తివంతమైనదని అంటారు. విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే ఆఖరి అమావాస్య. ఈ ఫాల్గుణ అమావాస్య లేదా కొత్త అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు ఏంటి, చేయకూడని తప్పులు ఏంటి వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

మార్చి 18 బుధవారం శక్తివంతమైన అమావాస్య:
మార్చి 18 అనగా రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యని ఫాల్గుణ అమావాస్య లేదా కొత్త అమావాస్య అని అంటారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. అమావాస్య తిథి ఉదయం 7:40కి ప్రారంభమవుతుంది. మార్చి 19 ఉగాది నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య ఉంటుంది. కాబట్టి ఈ రెండు రోజులు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి. కనుక కొన్ని నియమాలను పాటించాలి. అలాగే కొత్త అమావాస్య నాడు కచ్చితంగా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి.
పూజ గది మరియు దేవతల చిత్రపటాలు:
పూజ గదిని, దేవుడు చిత్రపటాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుంటాము. దేవుళ్లను కడిగి మళ్ళీ శుభ్రంగా పెట్టుకుంటాము. అయితే ఉగాది నాడు కూడా ఉదయం అమావాస్య ఉంది కాబట్టి, అమావాస్య వెళ్లిపోయిన తర్వాత మీరు పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే ఉగాదికి కావాల్సిన సామాగ్రిని కూడా ముందే తెచ్చి పెట్టుకోవద్దు.
ఉగాది పండుగ రోజు అమావాస్య పూర్తయిన తర్వాత తెచ్చుకోవడం మంచిది. ఉదయం ఏడు తర్వాత మీరు శుభ్రం చేసుకోవడం, సామాగ్రిని తెచ్చుకోవడం చేయొచ్చు. ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
కొత్త అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు:
అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. కొత్త అమావాస్య నాడు ఈ నియమాలు పాటించాలి. లేకపోతే జేష్ఠాదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని అంటారు.
ఉదయాన్నే త్వరగా నిద్రలేచి మీ పనులను మొదలు పెట్టుకోండి. ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం దరిద్ర దేవత ఇంట్లో నివసిస్తుందని చెబుతారు.
అమావాస్య నాడు చాలా మంది గుమ్మడికాయలను కడతారు. ఇంటికి గుమ్మడికాయ కట్టడం, దిష్టి తీయడం, కాలికి నల్ల దారం కట్టుకోవడం వంటివి చేస్తారు. ఇలా చేస్తే నరదృష్టి పీడలు తొలగిపోతాయి. ఈ కొత్త అమావాస్య నాడు కూడా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టి వేలాడదీస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
గుమ్మడికాయని కట్టే ముందు గుమ్మడికాయని శుభ్రంగా కడిగి పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టి వేలాడదీయండి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి అద్భుతంగా పని చేస్తుంది. మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి.
మనము ఎదుగుతున్నప్పుడు దిష్టి కుటుంబం మీద పడుతుంది. దిష్టి తగిలినట్లయితే ఎన్నో సమస్యలు కలుగుతాయి. చిన్నపిల్లలు ఉంటే అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీయండి. నరదృష్టి మొత్తం తొలగిపోతుంది.
అమావాస్య నాడు రావి చెట్టును ఆరాధించడం వలన కోరికలన్నీ నెరవేరుతాయి. రావి చెట్టు కింద దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనెతో వెలిగించడం మంచిది.
అమావాస్య నాడు నీళ్లలో గంగాజలాన్ని కలిపి స్నానం చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
అమావాస్య నాడు కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీయండి. ఆ తర్వాత కొబ్బరికాయని పగలగొట్టి ఎవరు తొక్కని చోట పడేయండి. ఇలా చేయడం వలన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి.
ఈ అమావాస్య నాడు గోమాతకు పచ్చ గడ్డి లేదా అరటి పండ్లు పెట్టితే చాలా మంచి జరుగుతుంది. శని దోషాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. రొట్టెలు వంటివి పెడితే శని దోషాల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.
అమావాస్య నాడు ఈ తప్పులు చేయకండి
- అమావాస్య నాడు జుట్టు కత్తిరించడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఆయుష్షు తగ్గిపోతుందని నమ్మకం. అమావాస్య నాడు అప్పు ఇవ్వకూడదు. అలా చేసినట్లయితే డబ్బులు తిరిగి రావని అంటారు.
- అమావాస్య రోజు రాత్రి ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్యనాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
- పెద్దవాళ్ళను తిట్టడం వంటివి చేయకూడదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


