Fearless Rasis: భయం అంటేనే తెలియదు.. ధైర్యానికి మారుపేరుగా నిలిచే రాశులు ఇవే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనిషి వ్యక్తిత్వంపై గ్రహాల ప్రభావం బలంగా ఉంటుంది. ముఖ్యంగా ధైర్యం, నాయకత్వ లక్షణాల విషయానికి వస్తే కొన్ని రాశుల వారు ఇతరుల కంటే భిన్నంగా కనిపిస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సవాలుగా తీసుకుని విజయపథంలో దూసుకెళ్లే ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 20, 2026, 12:30:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే, ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. ప్రతి రాశి వ్యక్తిత్వంపై ఆ రాశికి అధిపతిగా ఉన్న గ్రహ ప్రభావం పడుతుంది. ఈ గ్రహాధిపతి ప్రకారం వ్యక్తిలో కొన్ని శక్తులు, కొన్ని భయాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అవి బలాలు అయితే, అదే కొన్ని రాశులకు బలహీనతలు కావచ్చు. గ్రహాల అనుకూలతతో ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవచ్చు. ఈ లక్షణాల కారణంగా జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు.

Fearless Rasis: భయం అంటేనే తెలియదు.. ధైర్యానికి మారుపేరుగా నిలిచే రాశులు ఇవే! (pinterest)
Fearless Rasis: భయం అంటేనే తెలియదు.. ధైర్యానికి మారుపేరుగా నిలిచే రాశులు ఇవే! (pinterest)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారికి పెద్దగా భయం ఉండదు. అదే ఆ రాశుల ప్రత్యేకత. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉండగలరు. మరి ఆ రాశుల వారు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ రాశుల వారు చాలా ధైర్యవంతులు.. భయం అంటేనే తెలియదు!

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో ధైర్యసాహసాలను కలిగి ఉంటారు. అపారమైన శక్తితో ఉంటారు. ఈ రాశి వారు సహజంగా నిర్భయులు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం వెనకాడరు. కొన్నిసార్లు త్వరగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. మేష రాశిలో సూర్యుడు ఉంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. సొంత కృషితో విజయాలను అందుకుంటారు.

సింహ రాశి

రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువ. ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో కూడా ధైర్యంగా ఉండగలరు. అలాగే చాలా శక్తివంతులు. వీరు నాయకత్వం వహించడంలో ఎప్పుడూ ముందుంటారు. లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి అడ్డంకి వచ్చినా సరే అధిగమించగలరు. ప్రత్యర్థుల గురించి కూడా భయపడరు. ధైర్యంగా ఎదుర్కొని సక్సెస్‌ను అందుకుంటారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు ఓటమిని ఏమాత్రం ఇష్టపడరు. బయటకు కఠినంగా కనిపించినా, మనసులో దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కూడా ఈ రాశి వారు ఏమాత్రం కృంగిపోరు. తెలివితేటలు, వివేకంతో ముందుకు వెళ్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. గురువు అనుగ్రహంతో జ్ఞానం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి వల్ల కూడా ఈ రాశి వారికి ఎక్కువ భయం ఉండదు.

మేష రాశి వారు ఎందుకు త్వరగా కోపపడతారు?

మేష రాశికి కుజుడు అధిపతి. కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో, వీరికి ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఇది నాయకత్వానికి బలాన్నిచ్చినా, కొన్నిసార్లు కోపానికి కారణమవుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More