...
...
Next Story

నిద్రలేమి, అశాంతికి కారణం బెడ్‌రూమ్ అమరికేనా? ఫెంగ్ సూయ్ సూచనలు!

భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ ఫెంగ్ సూయ్‌లో కూడా బెడ్‌రూమ్‌లోని వస్తువుల అమరిక, నిద్రించే దిశకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మంచం దిశ, తలుపు స్థానం, గోడ మద్దతు, మంచం కింద శుభ్రత వంటి అంశాలు ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడతాయని ఫెంగ్ సూయ్ నమ్మకాలు చెబుతున్నాయి.

Published on: Aug 29, 2026, 09:30:53 IST
Advertisement

భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ వాస్తు విధానమైన 'ఫెంగ్ సూయ్' (Feng Shui) లో కూడా ఇంటిలోని ప్రతి వస్తువు సరైన దిశలో ఉండటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మన రోజంతా అలసటను తీర్చి, ప్రశాంతతను అందించే బెడ్‌రూమ్‌కు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. చాలా మంది నిద్రించేటప్పుడు సరైన దిశను పాటించకపోవడం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. బెడ్‌రూమ్‌లో మంచం ఉంచే సరైన విధానం, తల ఏ వైపు ఉండాలనే విషయాలపై ఫెంగ్ సూయ్ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.

నిద్రించేటప్పుడు తల ఏ దిశలో ఉండాలి?

నిద్రలేమి, అశాంతికి కారణం బెడ్‌రూమ్ అమరికేనా? ఫెంగ్ సూయ్ సూచనలు!
నిద్రలేమి, అశాంతికి కారణం బెడ్‌రూమ్ అమరికేనా? ఫెంగ్ సూయ్ సూచనలు!

ఫెంగ్ సూయ్ నిబంధనల ప్రకారం మనం రాత్రి పడుకునేటప్పుడు తల ఎప్పుడూ తూర్పు లేదా దక్షిణ దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు దిశలలో తలపెట్టి నిద్రించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో వర్క్ లోడ్ పెరిగిపోయి చాలా మంది మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ దిశలలో తలపెట్టి పడుకోవడం వల్ల మెదడు రిలాక్స్ అయ్యి చక్కటి నిద్ర పడుతుంది.

ముఖ్యంగా విద్యార్థులు ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రించాలని ఫెంగ్ సూయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశలో నిద్రించడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో రాణించాలనుకునే విద్యార్థులకు ఈ దిశ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే పొరపాటున కూడా ఉత్తర దిశ వైపు తలపెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే నిద్రకు భంగం కలగడంతో పాటు రాత్రి సమయంలో తీవ్రమైన ఆందోళన, అశాంతి కలుగుతాయి.

బెడ్ సరైన పొజిషన్ ఎలా ఉండాలి?

కేవలం తలపెట్టే దిశే కాకుండా గదిలో మంచం ఎక్కడ ఏర్పాటు చేశారనేది కూడా చాలా ముఖ్యం. ఫెంగ్ సూయ్ ప్రకారం మంచంపై పడుకున్నప్పుడు బెడ్‌రూమ్ తలుపు నేరుగా కంటికి కనిపించని విధంగా ఉంచాలి. అంటే మంచానికి సరిగ్గా ఎదురుగా తలుపు ఉండకూడదు. ఒకవేళ స్థలాల సర్దుబాటు లేక తలుపు ఎదుటే బెడ్ వేయాల్సి వస్తే, ఆ రెండింటి మధ్యలో ఒక చక్కటి కర్టెన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే నిద్రించేటప్పుడు మీ కాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి.

గోడ మద్దతు, బెడ్ కింద శుభ్రత

చాలా మంది ఇళ్లలో ఉపయోగపడని చెత్తాచెదారాన్ని, పాత సామాగ్రిని మంచం కింద దాచిపెడుతుంటారు. ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. మంచం కింద ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంటేనే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పుల ద్వారా మీ జీవితంలోని అనేక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks