ఫెంగ్ షుయ్: గుమ్మం దగ్గర ఈ వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులు!
ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తి, ఐశ్వర్యం ప్రవేశించే ముఖ్యమైన ప్రదేశం. అందుకే మెయిన్ డోర్ వద్ద చెత్తబుట్ట లేదా చెల్లాచెదురుగా చెప్పులు, బూట్లు ఉంచకూడదని సూచిస్తున్నారు. ఇవి ప్రతికూల శక్తిని పెంచి ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు, కుటుంబ కలహాలకు దారితీయవచ్చని నమ్మకం.
ఇంటి ప్రధాన ద్వారమే మన ఇంటికి అసలైన ముఖద్వారం. వాస్తు శాస్త్రం అయినా, ఫెంగ్ షుయ్ అయినా మెయిన్ డోర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. సకల శక్తులు, సానుకూల లేదా ప్రతికూల తరంగాలు ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన మార్గం ఇదే కావడంతో, దీనిని ఎప్పుడూ అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది ఇంట్లో అందంపై శ్రద్ధ పెట్టినట్లే, గుమ్మం బయట లేదా లోపల పొరపాట్లు చేస్తుంటారు.

సౌలభ్యం కోసం మెయిన్ డోర్ దగ్గరే కొన్ని వస్తువులను పడేస్తుంటారు. ఇవి ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను అడ్డుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాయని ఫెంగ్ షుయ్ హెచ్చరిస్తోంది. ప్రధాన ద్వారం దగ్గర అస్సలు ఉండకూడని రెండు ప్రధాన వస్తువులు ఏమిటో, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1. చెత్తబుట్ట: ఆశల పతనం.. అప్పుల ఊబి
స్థల భావం కారణంగా చాలా ఇళ్లలో డస్ట్ బిన్‌ను నేరుగా మెయిన్ డోర్ పక్కనే లేదా గుమ్మం వెనుక పెట్టేస్తుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇంటికి వచ్చే అతిథులకు లేదా సిరి సంపదలకు మొదటిగా స్వాగతం పలికేది మెయిన్ డోరే. అలాంటి చోటే చెత్తబుట్ట ఉంటే, ఆ ప్రాంతమంతా నెగెటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డస్ట్ బిన్ ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడంతో పాటు, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చైపోతుంది. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా అందులో అడ్డంకులు ఎదురవుతాయి. ఇంట్లోని వారి మనసు నిరంతరం అశాంతిగా, ఆందోళనకరంగా మారుతుంది.
2. చెల్లాచెదురుగా పడేసే బూట్లు, చెప్పులు
బయట నుంచి రాగానే చాలా మంది తమ బూట్లు, చెప్పులను నేరుగా మెయిన్ డోర్ ముందే విదిలించేస్తుంటారు. క్రమంగా అవి అక్కడ పెద్ద కుప్పలా పేరుకుపోతుంటాయి. ఈ అలవాటు ఇంట్లోని ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. బయటి ప్రదేశాల నుంచి తిరిగొచ్చినప్పుడు చెప్పుల ద్వారా దుమ్ము, ధూళితో పాటు ప్రతికూల శక్తులు కూడా ఇంటి గుమ్మాన్ని తాకుతాయి.
మెయిన్ డోర్ దగ్గరే చెప్పులు చెల్లాచెదురుగా ఉంటే, ఇంట్లోకి ప్రవేశించాల్సిన పాజిటివ్ ఎనర్జీకి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. దీని వల్ల కుటుంబంలో ఎల్లప్పుడూ అనవసరమైన గొడవలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. విపరీతమైన కలహాల వాతావరణం ఏర్పడి మనశాంతి కరువవుతుంది. ఒకవేళ షూస్ పెట్టుకోవాల్సి వస్తే ప్రధాన ద్వారానికి కాస్త దూరంగా, ఒక పద్ధతి ప్రకారం షూ-రాక్‌లో మాత్రమే అమర్చుకోవాలి.
ఇంటి ప్రధాన ద్వారం కోసం కొన్ని ముఖ్యమైన ఫెంగ్ షుయ్ చిట్కాలు:
ఇంటి మెయిన్ డోర్ వద్ద ఎప్పుడూ మంచి వెల్తురు ఉండేలా చూసుకోవాలి. చీకటిగా ఉండకూడదు.
ప్రధాన ద్వారాన్ని రోజూ శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడుక్కోవడం మంచిది.
సాధ్యమైనంతవరకు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు, గుమ్మాన్ని తుడుచుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
మెయిన్ డోర్ దగ్గర విండ్ చైమ్స్ లేదా ఫెంగ్ షుయ్ నాణేలను వేలాడదీయడం శుభప్రదం.
గుమ్మం రెండు వైపులా మనీ ప్లాంట్ లేదా జెట్ ప్లాంట్ వంటి పచ్చని మొక్కలను ఉంచడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ఆకర్షించబడుతుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


