రాత్రి పూట డైనింగ్ టేబుల్‌పై ఈ 3 వస్తువులు అస్సలు ఉంచకండి..!

Feng Shui Dining Table Tips : ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు డైనింగ్ టేబుల్‌పై కొన్ని వస్తువులను వదిలేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jun 6, 2026, 20:51:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Feng Shui Dining Table Tips : మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి చిన్న వస్తువుకు, అది ఉండే స్థానానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని ఫెంగ్ షుయ్ శాస్త్రం నమ్ముతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులు, ఇంట్లో వస్తువులను సర్దే విధానం మన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోని భోజన ప్రాంతం (డైనింగ్ ఏరియా) విషయానికి వస్తే కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం తప్పనిసరి.

ఫెంగ్ షుయ్ చిట్కాలు (image source pixel)
ఫెంగ్ షుయ్ చిట్కాలు (image source pixel)

ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం….. డైనింగ్ టేబుల్ అనేది కేవలం కూర్చుని ఆహారం తినే స్థలం మాత్రమే కాదు. అది ఆ ఇల్లాలు, ఆ కుటుంబం యొక్క సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ప్రతిబింబించే ఒక పవిత్రమైన స్థానం. అందుకే రాత్రి పడుకునే ముందు కేవలం వంటగదిని మాత్రమే కాకుండా, డైనింగ్ టేబుల్‌ను కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఫెంగ్ షుయ్ ప్రకారం రాత్రి వేళల్లో డైనింగ్ టేబుల్‌పై కొన్ని వస్తువులను అలాగే వదిలేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.

ఎంగిలి పాత్రలు, మురికి గిన్నెలు :

రాత్రి భోజనం ముగిసిన తర్వాత చాలామంది బద్ధకంతోనో లేదా ఉదయం తోముకోవచ్చనే ఆలోచనతోనో ఎంగిలి పాత్రలను, మురికి గిన్నెలను డైనింగ్ టేబుల్‌పైనే వదిలేస్తుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ అలవాటు ఇంట్లోకి ప్రతికూల శక్తిని (నెగెటివ్ ఎనర్జీని) వేగంగా ఆకర్షిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారితీస్తుంది. అంతేకాకుండా, ఉదయాన్నే నిద్రలేవగానే మురికిగా ఉన్న పాత్రలను చూడటం వల్ల రోజంతా మనస్సు ప్రశాంతంగా ఉండదు. అందుకే రాత్రి పడుకునే ముందే టేబుల్‌ను నీట్‌గా సర్దుకోవాలి.

ఖాళీ సీసాలు, ఖాళీ పాత్రలు:

డైనింగ్ టేబుల్‌పై నీళ్లు లేని ఖాళీ సీసాలు, మూతలు లేని ఖాళీ గిన్నెలు లేదా పాత్రలను రాత్రి పూట ఉంచడం అస్సలు మంచిది కాదు. ఫెంగ్ షుయ్ శాస్త్రంలో ఖాళీ పాత్రలు అనేవి జీవితంలో ఎదురయ్యే లోటుపాట్లకు, శూన్యతకు, ఆర్థిక ఇబ్బందులకు సంకేతంగా భావిస్తారు. ఈ వస్తువులు ఇంట్లో సంపద పెరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రాత్రి వేళల్లో వీటిని డైనింగ్ టేబుల్‌పై ఉంచకుండా వంటగదిలో వాటికి కేటాయించిన స్థానాల్లో సర్ది పెట్టడం ఉత్తమం.

ఇంటి బిల్లులు, అనవసరమైన కాగితాలు :

చాలామంది ఆఫీసు నుంచి రాగానే లేదా బయట షాపింగ్ చేసి రాగానే కరెంట్ బిల్లులు, వ్యాపార లావాదేవీల పత్రాలు, బ్యాంకు కాగితాలు, పాత రసీదులు లేదా న్యూస్ పేపర్లను డైనింగ్ టేబుల్‌పై పడేస్తుంటారు. ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం ఈ పద్ధతి అస్సలు సరైనది కాదు. ఆహారం తినే ప్రదేశంలో ఇలాంటి కాగితాలను, బిల్లులను పేరుకుపోయేలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని దెబ్బతీసి, అనవసరమైన ఖర్చులను, అప్పుల బాధలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో ప్రశాంతత….. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే డైనింగ్ టేబుల్‌ను ఎల్లప్పుడూ అద్దంలా మెరిసేలా ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు టేబుల్‌పై ఒక తాజా పండ్ల గిన్నెను గానీ లేదా పూల కుండీని గానీ ఉంచితే సానుకూల శక్తులు ఇల్లంతా వ్యాపిస్తాయి. నిద్రపోయే ముందు డైనింగ్ ఏరియాను చక్కగా సర్దుకోవడం వల్ల కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి.

నిరాకరణ- ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More