...
...
Next Story

ఫెంగ్ షుయ్ చిట్కాలు: ఇంటి ప్రధాన తలుపు నుండి వంటగది పొయ్యి నేరుగా కనపడుతోందా? ఇది నష్టం.. నేడే చర్యలు తీసుకోండి!

మీ ఇంటికి ప్రధాన ద్వారం నుంచి వంటగది ప్రత్యక్షంగా కనిపిస్తుందా? ఒకవేళ అవును అయితే, మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని చర్యలు మీకు ఉపశమనం కలిగిస్తాయి.

Published on: Jun 16, 2026 04:01 PM IST
Advertisement

ఇంటి నిర్మాణం, అలంకరణలో వాస్తుతో పాటు ఫెంగ్ షుయీ నిబంధనలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన ద్వారం నుంచి వంటగదిలోని స్టవ్ కనిపిస్తే ఆర్థిక సమస్యలు తప్పవని ఫెంగ్ షుయీ చెబుతోంది. దీన్ని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక సమస్యలకు కారణమయ్యే 'వంటగది' వాస్తు దోషాలు

feng shui tips
feng shui tips

ప్రస్తుత కాలంలో ఇల్లు కొన్నా, కట్టినా వాస్తు శాస్త్రంతో పాటు చైనీస్ వాస్తు విధానమైన 'ఫెంగ్ షుయీ'ని కూడా ఎంతో మంది పాటిస్తున్నారు. ఇంట్లోని ప్రతి మూలకూ ఒక శక్తి ఉంటుంది. అయితే, ఫెంగ్ షుయీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం (Main Door) నుంచి నేరుగా వంటగదిలోని పొయ్యి (Kitchen Stove) కనిపిస్తుంటే, అది తీవ్రమైన వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. దీని వల్ల ఇంట్లోని సానుకూల శక్తి (Positive Energy) బయటకు వెళ్లిపోవడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.

ఎందుకు అశుభం?

ఫెంగ్ షుయీ శాస్త్రం ప్రకారం, వంటగదిలోని స్టవ్ సంపదకు, సుఖశాంతులకు ప్రతీక. ఇంటి ప్రధాన ద్వారం ద్వారా వచ్చే శక్తి నేరుగా స్టవ్ మీద పడితే, ఆ సంపద ఇంట్లో నిలవదు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరగడమే కాకుండా, పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడం లేదా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని ఫెంగ్ షుయీ చెబుతోంది.

దోష నివారణకు సులభమైన మార్గాలు

పర్దా లేదా పార్టిషన్: ప్రధాన ద్వారం మరియు వంటగది మధ్య ఒక పల్చని పర్దాను లేదా అందమైన పార్టిషన్‌ను ఏర్పాటు చేయండి. దీని వల్ల దృష్టి నేరుగా స్టవ్ మీద పడదు.

తలుపులు మూసి ఉంచడం: వంటగదిలో తలుపు ఉన్నట్లయితే, అవసరం లేనప్పుడు ఆ తలుపును ఎప్పుడూ మూసి ఉంచండి.

శుభ్రత: వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా స్టవ్ మీద ఆహార పదార్థాలు పడకుండా చూసుకోండి. వంటగదిలో పాత, పనికిరాని వస్తువులను అస్సలు ఉంచకండి.

మొక్కలు: ప్రధాన ద్వారం వద్ద ఒక చిన్న ఆకుపచ్చని మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

పొరపాటున కూడా ఇలా చేయకండి

వంటగదిలో ఉండే కొన్ని చిన్న పొరపాట్లు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి. వంటగదిలో ఖాళీ డబ్బాలను ఎక్కువ కాలం ఉంచవద్దు. ఒకవేళ డబ్బాలు ఖాళీగా ఉంటే వాటిని నింపేయండి లేదా వేరే స్టోర్ రూమ్‌లోకి మార్చండి. అలాగే, వంట గదిలోని సింక్ దగ్గర ఉన్న కుళాయి నుంచి నీరు కారుతుంటే (Leaking Tap) వెంటనే సరిచేయండి. నీరు వృథాగా కారడం అంటే, మీ డబ్బు కూడా అలాగే వృథాగా పోతుందని ఫెంగ్ షుయీ హెచ్చరిస్తోంది. వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఉండటం వల్ల వంటలో రుచి పెరగడమే కాకుండా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe