ఇంట్లో లేదా ధరించే ఆభరణాలలో వాస్తు, ఫెంగ్ షుయ్ నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. నేటి డిజిటల్ యుగంలోనూ సంప్రదాయ నమ్మకాలు, ఫెంగ్ షుయ్ విశ్వాసాలకు ఆదరణ తగ్గలేదు. ముఖ్యంగా సిల్వర్ లేదా పంచలోహాలతో తయారు చేసిన తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాలు ధరించడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది.

ఫెంగ్ షుయ్ శాస్త్రంలో తాబేలుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని దీర్ఘాయువు, సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. అయితే, ఈ ఉంగరాన్ని కేవలం వేలికి తొడుక్కుంటే సరిపోదు. దీని వెనుక కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది?
చాలా మంది ఈ ఉంగరాన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా పెట్టుకుంటారు. కానీ, ఫెంగ్ షుయ్ నిబంధనల ప్రకారం దీనికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఉంగరం ధరించేటప్పుడు తాబేలు ముఖ భాగం ఎప్పుడూ మన అరచేయి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ధరించడం వల్ల సంపద, సానుకూల శక్తి మన వైపు ఆకర్షించబడుతుందని నమ్ముతారు.
ఒకవేళ తల బయటి వైపునకు ఉంటే, మీ వద్ద ఉన్న పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుందని సంకేతంగా భావిస్తారు. అలాగే, ఉంగరాన్ని పదే పదే తిప్పడం లేదా అనవసరంగా చేతితో కదిలించడం చేయకూడదు.
ఇతరులకు ఇవ్వడం, తీసుకోవడం నిషేధం
ఏ రత్నం ఉంగరమైనా లేదా ప్రత్యేక లోహంతో చేసిన ఆభరణమైనా ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఫెంగ్ షుయ్ నమ్మకాల ప్రకారం, మనం ధరించే ఉంగరానికి మన వ్యక్తిగత శక్తి (ఎనర్జీ) అనుసంధానమై ఉంటుంది.
అందువల్ల ఎవరికైనా మీ ఉంగరాన్ని ఇస్తే, మీ సానుకూల శక్తి వారికి వెళ్లే అవకాశం ఉంది. మిత్రులు లేదా బంధువులు సరదాగా అడిగినా ఈ ఉంగరాన్ని వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అదే విధంగా, వేరే వాళ్ళు వాడిన ఉంగరాలను మనం ధరించడం కూడా దోషంగా పరిగణిస్తారు.
పాటించాల్సిన ఇతర ముఖ్యమైన నియమాలు
{{/usCountry}}అందువల్ల ఎవరికైనా మీ ఉంగరాన్ని ఇస్తే, మీ సానుకూల శక్తి వారికి వెళ్లే అవకాశం ఉంది. మిత్రులు లేదా బంధువులు సరదాగా అడిగినా ఈ ఉంగరాన్ని వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అదే విధంగా, వేరే వాళ్ళు వాడిన ఉంగరాలను మనం ధరించడం కూడా దోషంగా పరిగణిస్తారు.
పాటించాల్సిన ఇతర ముఖ్యమైన నియమాలు
{{/usCountry}}ఈ ప్రత్యేకమైన ఉంగరాన్ని ధరించాలని భావిస్తే, శుక్రవారం రోజున ఎంచుకోవడం శ్రేయస్కరం.
ఒకవేళ ఏదైనా కారణం చేత ఉంగరాన్ని వేలి నుంచి తొలగించాల్సి వస్తే, దాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా పూజా గదిలో భద్రపరచాలి.
ఉంగరం మెరుపు తగ్గకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దీనిపై ఎలాంటి గీతలు పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.