హోలీ నుంచి ఈ 5 రాశుల వారి అదృష్టం పెరుగుతుంది.. డబ్బు, శుభవార్తలు, ప్రమోషన్లతో పాటు ఎన్నో లాభాలు!
శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడి సంచారంలో మార్పు వస్తే, అదే అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మార్చి 4వ తేదీన శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలుగుతాయి, మరి కొన్నిసార్లు అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడి సంచారంలో మార్పు వస్తే, అదే అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది.

కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మార్చి 4వ తేదీన శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి శని. శుక్రుడికి శని మంచి స్నేహితుడు. ఈ సంచారంతో కొన్ని రాశుల వారి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? హోలీతో ఏ రాశుల వారి అదృష్టం పెరుగుతుంది? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ నుంచి ఈ రాశుల వారి అదృష్టం పెరుగుతుంది.. శుక్ర సంచారంతో ఐదు రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. పని ప్రదేశంలో కూడా ఆనందం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రమోషన్లు పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కష్టమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
3.కన్య రాశి:
కన్య రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శుక్ర నక్షత్ర సంచారం కన్య రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించడంతో పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
4.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ సంచారం అనేక లాభాలను తీసుకు వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలను వింటారు. పిల్లల నుంచి కూడా శుభవార్తలు వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది.
5.కుంభ రాశి:
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కుంభ రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


