...
...
Next Story

నేటి నుంచి జూలై 16 వరకు గజకేసరి రాజయోగం.. మేష రాశితో సహా ఈ రాశుల వారికి భారీ ధన లాభం!

జూలై 14 నుంచి 16 వరకు కర్కాటక రాశిలో చంద్రుడు-గురువు కలయికతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం ప్రభావంతో మేషం, కర్కాటకం, ధనస్సు, సింహ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్లు, కొత్త అవకాశాలు, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది.

Published on: Jul 14, 2026, 14:01:05 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

నేటి నుంచి జూలై 16 వరకు గజకేసరి రాజయోగం.. మేష రాశితో సహా ఈ రాశుల వారికి భారీ ధన లాభం! (pinterest)
నేటి నుంచి జూలై 16 వరకు గజకేసరి రాజయోగం.. మేష రాశితో సహా ఈ రాశుల వారికి భారీ ధన లాభం! (pinterest)

జూలై 14, అనగా ఈరోజు నుంచి రెండు రోజుల పాటు గజకేసరి రాజయోగం ఉంటుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. గజకేసరి రాజయోగం చాలా శక్తివంతమైన రాజయోగం. చంద్రుడు, గురువుల కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడడం విశేషం.

జూలై 14 నుంచి జూలై 16 వరకు ఉండే ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు భారీగా ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. అలాగే విపరీతంగా కలిసి రానుంది. మరి గజకేసరి రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఈ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

జూలై 14 నుంచి 16 వరకు గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మేష రాశి

మేష రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రమోషన్లు కూడా వస్తాయి. మొత్తం మీద గజకేసరి రాజయోగం మీ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి భారీ లాభాల విషయంలో బాగా ఆలోచిస్తారు. మొత్తం మీద సానుకూల ఫలితాలను చూస్తారు.

3.ధనస్సు రాశి

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం ఊహించని విధంగా ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. అలాగే పూర్వీకుల నుంచి భారీగా ఆస్తులను పొందుతారు. పని ప్రదేశంలో సక్సెస్‌ను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కాన్ఫిడెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks