...
...
Next Story

Gold Astrology Benefits: బంగారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారు పొరపాటున ధరిస్తే కష్టాలు తప్పవు!

Gold Astrology Benefits: బంగారం దేవగురువు బృహస్పతికి చిహ్నం. అయితే అందరూ బంగారం ధరించడం మంచిది కాదు. ఏ రాశుల వారు బంగారం ధరిస్తే అదృష్టం వరిస్తుంది? ఎవరు దూరంగా ఉండాలి? బంగారం ధరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇక్కడ చూడండి.

Published on: May 14, 2026, 14:30:15 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి లోహానికి ఒక ప్రత్యేకత ఉంది. వీటిలో బంగారం అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. బంగారం దేవగురువు బృహస్పతికి (గురు గ్రహం) ప్రతిరూపం. సరిగ్గా ధరిస్తే జీవితంలో సుఖం, సంపద, అదృష్టం వెతుక్కుంటూ వస్తాయి. కానీ, జాతకంలో గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు బంగారం ధరించడం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే బంగారం కొనే ముందు లేదా ధరించే ముందు అది మన రాశికి సరిపోతుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

బంగారం ఎవరికి నష్టాన్ని కలిగిస్తుంది?

Gold Astrology Benefits: బంగారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారు పొరపాటున ధరిస్తే కష్టాలు తప్పవు! (AFP)
Gold Astrology Benefits: బంగారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారు పొరపాటున ధరిస్తే కష్టాలు తప్పవు! (AFP)

జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, కుంభం మరియు మకర రాశుల వారు బంగారం ధరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ, మిథున రాశులు: వీరు బంగారం ధరించడం వల్ల మానసిక ఒత్తిడి, అశాంతి పెరిగే ప్రమాదం ఉంది.

కన్య, మకర రాశులు: రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తాయి.

కుంభ, వృశ్చిక రాశులు: వీరికి ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు, కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. "జాతకంలో గురు గ్రహ స్థితిని బట్టి లోహాలను ఎంపిక చేసుకోవాలి," అని ప్రముఖ జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.

ఈ రాశుల వారికి బంగారం రాజయోగం

మరో వైపు, మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు మరియు మీన రాశుల వారికి బంగారం ధరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

మేష రాశి: వీరికి ధైర్యం, శక్తి పెరుగుతాయి.

సింహ రాశి: లక్ష్మీ కటాక్షం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

ధనుస్సు, మీన రాశులు: ఈ రాశులకు అధిపతి గురుడే కాబట్టి, బంగారం ధరించడం వల్ల రాజయోగం పడుతుంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

బంగారం ధరించడానికి పాటించాల్సిన నియమాలు

వేలి ఎంపిక: బంగారు ఉంగరాన్ని అనామిక (ఉంగరపు వేలు) లేదా తర్జని (చూపుడు వేలు)కి ధరించడం శ్రేయస్కరం.

కాళ్లకు వద్దు: పాదాలకు బంగారు పట్టీలు లేదా మెట్టెలు ధరించకూడదు. ఇది బృహస్పతిని అవమానించడమే అవుతుంది. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుముడుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

ఇలా ధరించకండి బంగారాన్ని ఇనుము లేదా అల్యూమినియం వంటి లోహాలతో కలిపి ధరించడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది.

శుభ సమయం: గురు గ్రహానికి సంబంధించినది కాబట్టి, కొత్త బంగారాన్ని గురువారం నాడు ధరించడం ఉత్తమం.

బంగారం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు

దాంపత్య సుఖం: భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ పెరగడానికి మెడలో బంగారు గొలుసు ధరించడం మంచిది.

ఆరోగ్యం: శ్వాసకోశ సమస్యలు, జలుబుతో బాధపడేవారు చిటికెన వేలికి బంగారం ధరించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

శక్తి ప్రదాత: శరీరం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరిస్తే శరీరానికి అవసరమైన వేడి, శక్తి లభిస్తాయి. ఇది నెగటివ్ ఎనర్జీని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

"బంగారం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రభుత్వ పనుల్లో విజయం చేకూర్చుతుంది," అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ మార్పులు చేసుకునే ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి నిపుణులతో పరిశీలించుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks