గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే అది అన్ని రాశుల వారిపైనా ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మరో ఎనిమిది రోజుల్లో, అంటే జూన్ 19న ఉదయం 10:06 గంటలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. నీడ గ్రహం కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచారం చేస్తున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడినప్పుడు అది గ్రహణ యోగానికి దారి తీస్తుంది. ఈ యోగం సవాళ్లతో కూడుకున్నదని చెప్పచ్చు. ఎందుకంటే దీని ప్రభావం మానసిక అస్థిరత, గందరగోళం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, జీవితంలో హెచ్చుతగ్గులు ఇలా పలు మార్పుల రూపంలో కనిపిస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఏ రాశుల వారు గ్రహణ యోగం సమయంలో జాగ్రత్తగా ఉండాలి? ఏ రాశుల వారికి ఎలాంటి సమస్యలు కలిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్త పడడం మంచిది.
గ్రహణ యోగంతో ఈ రాశుల వారికి చిక్కులు.. ఈ సమయంలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
మేష రాశి
మేష రాశి వారికి గ్రహణ యోగం కారణంగా సమస్యలు రావచ్చు. ఆరోగ్యం, మానసిక స్థితిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏకాగ్రత కూడా దెబ్బతినవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక నష్టం కలగొచ్చు. కోర్టు కేసులు, న్యాయపరమైన వ్యవహారాల్లో ఉన్నట్లయితే సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలు, కళల్లో ప్రయత్నాలు చేస్తున్న వారికి పురోగతి అవకాశాలు ఉన్నా, విజయం కోసం శ్రమ ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
కన్యా రాశి
{{/usCountry}}ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక నష్టం కలగొచ్చు. కోర్టు కేసులు, న్యాయపరమైన వ్యవహారాల్లో ఉన్నట్లయితే సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలు, కళల్లో ప్రయత్నాలు చేస్తున్న వారికి పురోగతి అవకాశాలు ఉన్నా, విజయం కోసం శ్రమ ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
కన్యా రాశి
{{/usCountry}}ఈ రాశి వారికి గ్రహణ యోగం సవాళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇల్లు, ఉద్యోగం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఈ రాశి వారికి ఈ సమయంలో కష్టంగా ఉండొచ్చు. మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు. ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వద్దు. స్నేహితులు, ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాన్ని పెంచకుండా సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం.
మీన రాశి
మీన రాశి వారికి ఈ సమయం గందరగోళంగా ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు అప్పుగా ఇవ్వడం, పెట్టుబడి పెట్టడానికి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం చాలా అవసరం. మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం జరగొచ్చు. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించి వివాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.