12 ఏళ్ల తర్వాత కర్కాటకంలోకి గురువు.. ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు!

జూన్ 2వ తేదీన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగే ఈ అద్భుత గోచారంతో మేషం, కర్కాటకంతో పాటు మరో నాలుగు రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆ వివరాలు మీకోసం.

Published on: May 27, 2026, 11:35:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా దేవ గువు బృహస్పతి రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తారు. 2026 జూన్ నెల జ్యోతిష్య పరంగా ఒక పెద్ద మలుపు కాబోతోంది. ఎందుకంటే, సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగు పెడుతున్నారు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలోకి గురుడు రావడం వల్ల గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

12 ఏళ్ల తర్వాత కర్కాటకంలోకి గురువు.. ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు!
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలోకి గురువు.. ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు!

జ్యోతిష్య గణాంకాల ప్రకారం, జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఈ గోచారం జరగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు ఇదే రాశిలో ఉంటారు. ఈ ఐదు నెలల కాలంలో గురుడి అనుగ్రహం వల్ల మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ 6 రాశుల వారికి మాత్రం అదృష్టం వెల్లువలా రాబోతోంది.

మేష రాశి

మేష రాశి వారికి ఈ గోచారం చాలా శుభప్రదంగా మారుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. గురువు, చంద్రుడి అనుగ్రహం తోడై ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి

స్వయంగా కర్కాటక రాశిలోనే గురుడి సంచారం జరుగుతోంది కాబట్టి, ఈ రాశి వారికి రాజయోగం పట్టినట్లే. ముఖ్యంగా కెరీర్ పరంగా మీరు ఆశించిన మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమకు ఇష్టమైన చోటుకు బదిలీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆస్తిపాస్తుల విషయంలో ఉన్న వివాదాలు తొలగిపోయి, కొత్త ఆస్తులు కొనే అవకాశం మెరుగుపడుతుంది.

సింహ రాశి

సింహ రాశి జాతకులకు ఈ కాలం వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను చూస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పెద్ద డీల్స్ ఈ సమయంలో ఓకే అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

తులా రాశి

జూన్ 2 తర్వాత తులా రాశి వారి జీవితంలో పురోగతి వేగవంతం అవుతుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు దక్కుతాయి, ఇది మీ హోదాను పెంచుతుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టపడి పనిచేసే తత్వం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సంచారం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న చికాకులు తొలగిపోయి, లాభాల బాట పడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా నిలకడ సాధిస్తారు.

మీన రాశి

ఈ రాశి మార్పు మీన రాశి వారికి సామాజికంగా మంచి గుర్తింపు తెస్తుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

గురు దోష నివారణకు పరిహారాలు

బృహస్పతి అనుగ్రహం రెట్టింపు కావాలంటే ఈ గోచార కాలంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. "ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి," అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అరటి చెట్టుకు పూజ చేయడం, పసుపు రంగులో ఉండే శనగలు లేదా పప్పు దినుసులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి గురువారం 'ఓం బృం బృహస్పతయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిరాకరణ: (ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము.) వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. )

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More