...
...
Next Story

గురు పుష్య యోగం: రేపు ఈ పసుపు కొమ్ముల పరిహారంతో పాటు ఈ రెండు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది!

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ముహూర్తాల్లో 'గురు పుష్య యోగం' ఒకటి. జూన్ 18న ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం మీ ఆర్థిక స్థితిని మార్చే సువర్ణావకాశం. ఈ రోజున చేసే పరిహారాలు మీ ఇంట్లో ఏడాది పొడవునా సిరిసంపదలు వెల్లివిరిసేలా చేస్తాయి.

Published on: Jun 17, 2026, 16:00:26 IST
Advertisement

జ్యోతిష్య గణాంకాల ప్రకారం, గురు గ్రహం పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ యోగం సిద్ధిస్తుంది. జూన్ 18న ప్రారంభమై, ఆగస్టు 18 వరకు గురు గ్రహం వివిధ దశల్లో పుష్య నక్షత్రంలోనే సంచరిస్తుంది. ఈ కాలంలో ఏ పని మొదలు పెట్టినా, దైవ ప్రార్థనలు చేసినా అవి త్వరగా ఫలిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ధన సంపాదన, ఆస్తి వృద్ధి, శుభకార్యాల ఆరంభానికి ఇది అత్యంత అనువైన సమయం.

ధన ప్రాప్తికి, ఐశ్వర్యానికి పరిహారాలు

గురు పుష్య యోగం: రేపు ఈ పసుపు కొమ్ముల పరిహారంతో పాటు ఈ రెండు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది!
గురు పుష్య యోగం: రేపు ఈ పసుపు కొమ్ముల పరిహారంతో పాటు ఈ రెండు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది!

గురు పుష్య యోగంలో లక్ష్మీదేవిని, గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆటంకాలు తొలగిపోయి, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

1. మహాలక్ష్మి అనుగ్రహం కోసం

జూన్ 18న పసుపు రంగు వస్త్రంలో కొన్ని పసుపు కొమ్ములను, ఒక నాణేన్ని, కొన్ని గవ్వలను ఉంచి మూట కట్టండి. ఈ మూటను మీ ఇంటి బీరువాలో లేదా ధన స్థానంలో ఉంచండి. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండి, ఏడాది పొడవునా ధనానికి లోటు ఉండదు. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

2. సిరి సంపదలకు ప్రతీక - స్వస్తిక్

మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు, కుంకుమ, కలిపిన పేస్ట్‌తో 'స్వస్తిక్' గుర్తును వేయండి. 'ఓం' లేదా 'శ్రీ' అని కూడా రాయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ వైబ్స్ నిండుతాయి. ఇది ఐశ్వర్యానికి మార్గం సుగమం చేస్తుంది.

3. కనకధార స్తోత్ర పఠనం

గురు పుష్య యోగం రోజున లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి, భక్తితో 'కనకధార స్తోత్రం' లేదా 'లక్ష్మీ చాలీసా' పఠించండి. దీని వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మనిషికి మనశ్శాంతి లభించడమే కాకుండా, చేసే పనుల్లో విజయం చేకూరుతుంది.

ఆచరించాల్సిన జాగ్రత్తలు

గురు గ్రహం, పుష్య నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడే ఈ యోగం సంపదను, పురోభివృద్ధిని ఇచ్చే శక్తివంతమైన కాలంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడుతుంది.

ఈ పరిహారాలను ఏ సమయంలో చేయాలి?

జూన్ 18న వీలైనంత వరకు ఉదయం పూట లక్ష్మీ పూజ, పరిహారాలు పూర్తి చేయడం అత్యంత శుభప్రదం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks