గురు-శుక్రుల అరుదైన కలయిక.. జూలై నుంచి అదృష్టం వరించనున్న ఆ నాలుగు రాశులు ఇవే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గురు, శుక్ర గ్రహాల కలయిక అత్యంత విశిష్టమైనది. సుఖ సంతోషాలు, సంపద, విలాసాలకు కారకులైన ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒక అద్భుతమైన 'ద్వాదశ యోగం' ఏర్పడుతుంది. జూలై 10వ తేదీన ఉదయం 5:53 గంటలకు ఈ రెండు గ్రహాలు 30 డిగ్రీల కోణంలో కలవబోతున్నాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు కూడా శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. గురువు, శుక్రుడు అత్యంత శుభప్రదమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి సుఖసంతోషాలు, సంపద, ప్రగతి కలుగుతాయి.
గురు, శుక్రుల కలయిక
జూలై 10వ తేదీన ఉదయం 5:53 గంటలకు ఈ రెండు గ్రహాల మధ్య 30 డిగ్రీల కోణంలో అరుదైన ద్వాదశ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
గురు-శుక్ర అరుదైన కలయిక: జూలై 10 నుంచి ఈ రాశులకే సువర్ణ యుగం!
1.మిథున రాశి:
ఈ రాశి వారికి ద్వాదశ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పులతో బాధపడుతున్న వారు వివిధ మార్గాల ద్వారా డబ్బును పొందుతారు. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి. పరస్పర నమ్మకం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలను పొందుతారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరంగా, సామాజికపరంగా మంచి ఫలితాలను చూస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది. పనికి ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీ జీతం పెరిగే అవకాశం ఉంది. పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల రాకతో వ్యాపారం బాగా సాగుతుంది.
3.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సానుకూల ప్రభావాన్ని చూస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు, శుభకార్యాలలో పాల్గొంటారు. మనశ్శాంతి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభసమయం. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
4.మీన రాశి:
మీన రాశి వారికి ఈ ద్వాదశ యోగం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలను పొందుతారు. ఆర్థికంగా కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో బంధాలు మధురంగా మారుతాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. సంతోషం కూడా పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


