వేద జ్యోతిష్య శాస్త్రంలో దేవగురు బృహస్పతి నక్షత్ర సంచారానికి అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం సంపద, సంతాన సౌభాగ్యం, అదృష్టం, ఉన్నత విద్య మరియు జ్ఞానానికి కారకుడిగా వ్యవహరిస్తారు. అటువంటి బృహస్పతి అక్టోబర్ 31, 2026 నాడు మఖ నక్షత్రంలోకి ప్రవేశించాడు. వచ్చే 2027 జనవరి 24 వరకు అంటే దాదాపు 81 రోజుల పాటు గురు భగవానుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.

మఖ నక్షత్రానికి అధిపతి కేతువు. దీంతో ఈ 81 రోజుల వ్యవధిలో గురువుపై కేతు ప్రభావం కూడా స్పష్టంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం మఖ నక్షత్రం అనేది సమాజంలో ఉన్నత హోదాలు, ప్రతిష్టాత్మక సంస్థలు, పరిపాలనా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బృహస్పతి ఏ రాశి లేదా నక్షత్రం గుండా పయనిస్తాడో, ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలను అమితంగా పెంచుతాడు.
ఈ నక్షత్ర మార్పు వ్యక్తిగత జీవితం, అధికార పీఠాలు, నిపుణుల కార్యక్షేత్రాలలో కీలక నిర్ణయాలకు దారితీస్తుంది. ఈ కాలంలో సామాజికంగా హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గురు గ్రహ మాఘ నక్షత్ర సంచారం ద్వాదశ రాశులపైనా ప్రభావం చూపినప్పటికీ…. ముఖ్యంగా 4 రాశుల వారికి అత్యంత శుభప్రదమైన, ఊహించని ధన లాభాలను తెచ్చిపెట్టనుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి గురుడు నాల్గొవ ఇంట సంచరిస్తున్నాడు. దీనివల్ల నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. భౌతిక సుఖసంతోషాలు, సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఎనిమిది, పది, పన్నెండవ స్థానాలపై గురు దృష్టి ఉండటం వల్ల రాబడి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా హోదా పెంపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో మంచి లాభాలు అందుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి రెండవ ఇంట (ధన, వాక్ స్థానం) గురు సంచారం జరుగుతుంది. ఫలితంగా ఈ కాలంలో అదృష్టం వర్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. పొదుపు చేయడంలో, సంపదను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసివచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మాటకారితనం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన పాత బాకీలు, చిక్కుకున్న డబ్బులు చేతికి అందుతాయి.
కన్యా రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి రెండవ ఇంట (ధన, వాక్ స్థానం) గురు సంచారం జరుగుతుంది. ఫలితంగా ఈ కాలంలో అదృష్టం వర్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. పొదుపు చేయడంలో, సంపదను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసివచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మాటకారితనం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన పాత బాకీలు, చిక్కుకున్న డబ్బులు చేతికి అందుతాయి.
కన్యా రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి 12వ ఇంట గురు సంచారం వల్ల జీవితంలో అద్భుతమైన, సానుకూల మార్పులు మొదలవుతాయి. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనుకూలమైన అవకాశాలు పొందుతారు. ఇంట్లో శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు. కొత్తగా స్థలాలు, ఇళ్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. మనశ్శాంతి, ఆత్మసంతృప్తి లభిస్తాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఏడవ ఇంట్లో గురుడు సంచరిస్తుండటం వల్ల జీవితంలో ఊహించని సంతోషకరమైన మార్పులు వస్తాయి. అన్ని మార్గాల నుంచి ధనాగమనం ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్నతాధికారుల పూర్తి సహకారం అందుతుంది. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.