సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు పెట్టడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మన ఇంటి పైకప్పుపై కొన్ని పక్షులు కనిపిస్తే అది అశుభమని నమ్ముతారు. కొన్ని పక్షులు మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తూ, వింత శబ్దాలు చేస్తుంటే దానిని శుభశకునంగా పరిగణించలేరు. ఇవి మన భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు ఇస్తున్నాయని నమ్మకం. మనం ఈ సంకేతాలను సరిగ్గా గమనించి అప్రమత్తంగా ఉండాలి. ఈ పక్షులు మీకు త్వరలో ఆర్థిక, కుటుంబ, ఇతర సమస్యలు వస్తాయని సూచిస్తాయి. మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తున్నా లేదా గట్టిగా అరుస్తున్నా ఏ పక్షి అశుభమో తెలుసుకుందాం.

ఒకవేళ రాబందు లేదా గద్ద పదేపదే మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి కూర్చుని అరిస్తే.. అది శుభశకునంగా పరిగణించరు. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. గబ్బిలాలు పదేపదే వచ్చి ఇంటిలోని ఏ భాగం మీదైనా లేదా పైకప్పు మీదైనా కూర్చుంటే, అది చాలా అశుభంగా పరిగణిస్తారు.
ఒకవేళ గుడ్లగూబ మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి కొన్ని రోజుల పాటు నిరంతరం అరుస్తూ ఉన్నా లేదా వింత శబ్దాలు చేసినా దీనిని కూడా శుభసూచకంగా పరిగణించరు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు అశుభ సంకేతం. సాధారణంగా ఇంటి పైకప్పు మీద కాకి కనిపిస్తే, అది అతిథుల రాకకు సంకేతమని చాలామంది నమ్ముతారు. అయితే ఆ కాకి మీ ఇంటికి దక్షిణం వైపు తిరిగి శబ్దం చేస్తే.. అది అశుభంగా పరిగణించరు. ఇది కాకుండా తీతువు పిట్ట మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి అరవడం కూడా అశుభం.
ఇంటి పైకప్పు మీద గబ్బిలాలు లేదా రాబందులు వాలి, పదేపదే అరవడం లేదా ఏడవడం ప్రారంభిస్తే, మీరు త్వరలో పేదరికాన్ని ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. ఇది ఆర్థిక సమస్యలకు సంకేతం. ఒక కాకి మీ ఇంటికి దక్షిణ దిశలో వాలి అరవడం ప్రారంభిస్తే.. అది కుటుంబంలో కొంత అసమ్మతి లేదా కలహానికి సంకేతం కావచ్చు. ఇది గౌరవం తగ్గడానికి కూడా ఒక సంకేతంగా పరిగణిస్తారు. కుటుంబంలోని ఎవరైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా ఇది సూచిస్తుంది.
ఈ పక్షులలో ఏవైనా మీ ఇంటి పైకప్పు మీద పదేపదే కిచకిచలాడుతుంటే.. మీరు చేయవలసిన మొదటి పని పైకప్పును శుభ్రం చేయడం. అక్కడ ఏదైనా చెత్త లేదా ఎండు కట్టెలు ఉంటే వాటిని తొలగించండి. పక్షులను ఇంట్లో పంజరంలో ఉంచవద్దు. పావురాలకు లేదా ఇతర పక్షులకు ఆహారం, నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటికి, కుటుంబానికి మంచి జరుగుతుంది.
{{/usCountry}}ఈ పక్షులలో ఏవైనా మీ ఇంటి పైకప్పు మీద పదేపదే కిచకిచలాడుతుంటే.. మీరు చేయవలసిన మొదటి పని పైకప్పును శుభ్రం చేయడం. అక్కడ ఏదైనా చెత్త లేదా ఎండు కట్టెలు ఉంటే వాటిని తొలగించండి. పక్షులను ఇంట్లో పంజరంలో ఉంచవద్దు. పావురాలకు లేదా ఇతర పక్షులకు ఆహారం, నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటికి, కుటుంబానికి మంచి జరుగుతుంది.
{{/usCountry}}