గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫలదాతగా శనిని చెబుతారు. శని భగవానుడి అనుగ్రహం కలిగితే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఒకవేళ శని వల్ల ఇబ్బందులు వస్తే, అనేక విధాలుగా సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.
శని సంచారం

శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. శని సంచారం, దృష్టి ప్రభావం కారణంగా రానున్న మూడేళ్ల కాలం రెండు ప్రత్యేకమైన రాశులకు ఊహించని విధంగా లాభాలు కలగబోతున్నాయి. ఈ రెండు రాశుల వారికి ఇదే గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రెండు రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
శని కారణంగా ఈ రెండు రాశుల వారికి జాక్‌పాట్.. రానున్న మూడేళ్లు అద్భుతాలే!
1.మిథున రాశి
మిథున రాశి వారికి ఇది అదృష్ట యోగం అని చెప్పొచ్చు. మిథున రాశి వారికి శని సంచారంతో విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే, ఇది సరైన సమయం అని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసులు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న విభేదాలు కూడా ఈ మూడేళ్ల కాలంలో తొలగిపోయి, బంధాలు దృఢంగా మారుతాయి.
2.వృషభ రాశి
శని కారణంగా ఈ రాశి వారికి కూడా బాగా కలిసొస్తుంది. రానున్న మూడేళ్లు అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు కూడా ఈ సమయంలో ఈ రాశి వారు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి అవకాశం. వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కూడా ఇది మీకు మంచి సమయం.
{{/usCountry}}శని కారణంగా ఈ రాశి వారికి కూడా బాగా కలిసొస్తుంది. రానున్న మూడేళ్లు అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు కూడా ఈ సమయంలో ఈ రాశి వారు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి అవకాశం. వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కూడా ఇది మీకు మంచి సమయం.
{{/usCountry}}ఈ రాశి వారు ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంతింటి కల నెరవేరే అవకాశం కూడా కనిపిస్తోంది. రాబడి భారీగా పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. శని అనుగ్రహంతో అన్నీ సర్దుకుంటాయి.
శని ఎలాంటి వారిని ఇష్టపడతారు?
శని దేవుడు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండేవారిని, కష్టపడి పని చేసే వారిని అనుగ్రహిస్తాడు. శని అనుగ్రహం ఉంటే ఆ రాశి వారికి తిరుగే ఉండదు. శని అనుగ్రహాన్ని పొందడానికి శనివారం నాడు నువ్వుల నూనెతో శని దేవుని ఆలయంలో దీపారాధన చేయడం మంచిది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కూడా శని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు తగ్గుతాయి.
అనవసరంగా ఇతరులను చిన్నచూపు చూడడం, చిన్న పనులు చేసుకునే వారిని తక్కువ చేసి చూడడం మంచిది కాదు. కుదిరితే అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల శని అనుగ్రహం కలిగి, ఇబ్బందులు, కష్టాలు తొలగిపోతాయి.