జూన్ 2026 పండుగల క్యాలెండర్: యమునా పుష్కరాల నుంచి వట పూర్ణిమ వరకు.. పూర్తి లిస్ట్!
June 2026 festival calender: జూన్ నెలలో ఆధ్యాత్మిక పండుగలు, పర్వదినాలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నది పుష్కరాలు, మృగశిర కార్తె, నిర్జల ఏకాదశి వంటి ఎంతో విశిష్టమైన రోజులు ఈ నెలలోనే ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.
ఆధ్యాత్మికపరంగా 2026 జూన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో అత్యంత పవిత్రంగా భావించే కొన్ని పండుగలు, వ్రతాలు వచ్చాయి. ద్వాదశ నది పుష్కరాలలో ఒకటైన యమునా నది పుష్కరాలు కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. అలాగే రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే మృగశిర కార్తె, విష్ణు అనుగ్రహం కోసం పాటించే నిర్జల ఏకాదశి ఇలా విశిష్ట పర్వదినాలు వచ్చాయి. మరి జూన్ నెలలో వచ్చిన ముఖ్యమైన రోజులు, పండుగల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ నెలలో వచ్చిన పండుగలు, పర్వదినాలు పూర్తి లిస్ట్ ఇదిగో
జూన్ 1 యమునా నది పుష్కరాలు
జూన్ 3 దత్తాత్రేయ జయంతి
జూన్ 4 సంకటహర చతుర్థి
జూన్ 8 మృగశిర కార్తె, త్రిలోచనా గౌరీ పూజ
జూన్ 11 ఏకాదశి
జూన్ 13 మాస శివరాత్రి, యమునా నది పుష్కరాలు పూర్తి
జూన్ 15 మిధున సంక్రాంతి, అధిక జ్యేష్ఠం ముగింపు
జూన్ 17 ఉమామహేశ్వర పూజ
జూన్ 23 వనగౌరీ వ్రతం
జూన్ 24 గాయత్రీ జయంతి
జూన్ 25 నిర్జల ఏకాదశి, జ్యేష్ఠాభిషేకం
జూన్ 26 రామలక్ష్మణ ద్వాదశి
జూన్ 27 శని త్రయోదశి
జూన్ 29 జ్యేష్ఠ పూర్ణిమ, వట పూర్ణిమ వ్రతం.
యమునా నది పుష్కరాలు:
జూన్ 1న యమునా నది పుష్కరాలు అత్యంత వైభవంగా మొదలవుతాయి. 12 ఏళ్లకు ఒకసారి ఇవి వస్తాయి. దాదాపు 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. ఉత్తర భారతదేశంలో మధుర, బృందావనం లాంటి క్షేత్రాలలో ఈ పుష్కర శోభ సంతరించుకోబోతోంది.
మృగశిర కార్తె:
జూన్ 8న మృగశిర కార్తె మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు దీనిని వ్యవసాయ పనుల ప్రారంభ సూచికగా భావిస్తారు. అలాగే అదే రోజు త్రిలోచనా గౌరీ పూజ కూడా వచ్చింది.
నిజ జ్యేష్ఠం
జూన్ 15తో అధిక జ్యేష్ఠం పూర్తవుతుంది. తర్వాత రోజు నుంచి నిజ జ్యేష్ఠం మొదలవుతుంది. అలాగే అదే రోజు మిధున సంక్రాంతి వచ్చింది. సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. ఆరోజు దానధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
శని త్రయోదశి:
జూన్ 27న శని త్రయోదశి వచ్చింది. ఆ రోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చు. శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
జ్యేష్ఠ పూర్ణిమ, వట పూర్ణిమ
జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమతో పాటు వట పూర్ణిమ వ్రతం ఉంది. ఆ రోజు ముత్తైదువులు సౌభాగ్యం కోసం మర్రి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ పండుగతో ఈ నెలలోని ప్రధాన పర్వదినాలు పూర్తవుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


