గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పడడం చూస్తూ ఉంటాం. జూన్ నెలలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతోంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారు జూన్ నెలలో అనేక రకాల లాభాలను పొందుతారు.
శుక్ర సంచారం

శుక్రుడు డబ్బు, ప్రేమ, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలు, చెడ్డ వాటికి చెడ్డ ఫలితాలను ఎదుర్కోక తప్పదు. ఈ రెండు గ్రహాల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడబోతోంది.
ఇది జూన్ 25న ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ శక్తివంతమైన యోగం కారణంగా వివిధ లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాజయోగంతో రాజయోగం పట్టే రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శని, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి రాజయోగం
1.కన్య రాశి:
కన్య రాశి వారికి నవపంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా సక్సెస్ అందుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను పొందుతారు. వారి కెరీర్ బాగుంటుంది. ప్రేమ జీవితం మరింత దృఢంగా మారుతుంది. రానున్న రోజులు ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తాయి.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా జూన్ నెల బాగుంటుంది. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ రాశి వారు విపరీతంగా ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా చక్కగా పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు పని ప్రదేశంలో వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయం.
3.మిథున రాశి:
మిథున రాశి వారికి రెండు గ్రహాల కలయిక మంచి ఫలితాలను అందిస్తుంది. కెరీర్లో అద్భుతమైన మార్పులను చూస్తారు. శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఊహించని విధంగా జూన్ నెల ఉంటుంది.
4.కుంభ రాశి:
{{/usCountry}}మిథున రాశి వారికి రెండు గ్రహాల కలయిక మంచి ఫలితాలను అందిస్తుంది. కెరీర్లో అద్భుతమైన మార్పులను చూస్తారు. శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఊహించని విధంగా జూన్ నెల ఉంటుంది.
4.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ రాజయోగానికి అధిపతి శని కావడంతో, ఈ రాశి వారికి కూడా ఈ నెల బాగుంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే నవపంచమ యోగం ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తారు. పిల్లల నుంచి కూడా ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. ఇలా మొత్తానికి ఈ సమయం ఈ రాశి వారికి కూడా చాలా బాగుంటుంది.