గురువు డబుల్ ధమాకా.. 5 నెలల పాటు గజకేసరి రాజయోగం, 4 రాశులకు లైఫ్ ఫుల్లుగా మారిపోతుంది!

2026లో గురువు సంచారం చాలా ముఖ్యమైనది. గురువు ఏడాదికి ఒకసారి సంచారంలో మార్పు చేస్తాడు. 2025లో ఒక్కసారి మాత్రమే సంచారంలో మార్పు చేసిన గురువు, ఈ ఏడాది ఐదు నెలల్లో రెండు సార్లు సంచారంలో మార్పు చేయనున్నాడు. గురువు సంచారంలో మార్పు రావడంతో గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది. 

Published on: Mar 23, 2026 2:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. దేవగురువు బృహస్పతి జ్ఞానం, సంపద, సంతోషం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. 2026లో గురువు సంచారం చాలా ముఖ్యమైనది. గురువు ఏడాదికి ఒకసారి సంచారంలో మార్పు చేస్తాడు.

గురువు డబుల్ ధమాకా.. 5 నెలల పాటు గజకేసరి రాజయోగం, 4 రాశులకు లైఫ్ ఫుల్లుగా మారిపోతుంది (pinterest)
గురువు డబుల్ ధమాకా.. 5 నెలల పాటు గజకేసరి రాజయోగం, 4 రాశులకు లైఫ్ ఫుల్లుగా మారిపోతుంది (pinterest)

2025లో ఒక్కసారి మాత్రమే సంచారంలో మార్పు చేసిన గురువు, ఈ ఏడాది ఐదు నెలల్లో రెండు సార్లు సంచారంలో మార్పు చేయనున్నాడు. అలాగే గురువు సంచారంలో మార్పు రావడంతో గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది.

ఐదు నెలల పాటు గజకేసరి రాజయోగం:

మామూలుగా చూసినట్లయితే, గురువు ఏడాదికి ఒకసారి తన సంచారంలో మార్పు చేస్తాడు. 2026లో చూసుకున్నట్లయితే, జూన్ నుంచి అక్టోబర్ దాకా రెండు సార్లు తన సంచారంలో మార్పు రాబోతోంది. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి జూన్ నెలలో గురువు ప్రవేశించినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన రాజయోగం. దీంతో నాలుగు రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

గజకేసరి రాజయోగం.. నాలుగు రాశులకు అనేక లాభాలు

1.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి గురువు గజకేసరి రాజయోగం విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. విష్ణువును పూజించి, గురువారం నాడు ఉపవాసం ఉంటే ఈ రాశి వారి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

2.మిథున రాశి:

మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పప్పులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

3.వృషభ రాశి:

వృషభ రాశి వారికి గురువు గజకేసరి రాజయోగం అనేక లాభాలను తీసుకు వస్తుంది. సమస్యలను తొలగిస్తుంది. కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులను చూస్తారు. గురువారం నాడు పూజకు సంబంధించిన సామాగ్రిని గుడిలో దానం చేయడం మంచిది. అలాగే “ఓం బ్రహ్మ బృహస్పతయే నమః” మంత్రాన్ని జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

4.కర్కాటక రాశి:

ఈ రాశి వారికి కూడా గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. గోవులకు ఆహారాన్ని సమర్పించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గురువారం నాడు ఉపవాసం ఉంటే కూడా మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More