జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా దేవగురువుగా పిలిచే బృహస్పతి (గురుడు) రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా జ్యోతిష్య నిపుణులు పరిగణిస్తారు. ఇతర గ్రహాలతో పోలిస్తే గురు గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి గురుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. అదృష్టం, సంతానం, సంపద, విద్య, జ్ఞానానికి కారకుడైన బృహస్పతి.. తాజాగా తన స్థానాన్ని మార్చుకుంటున్నారు.

ప్రస్తుతం బుధ గ్రహానికి చెందిన మిథున రాశిలో ఉన్న గురుడు.. నేటి అర్థరాత్రి దాటాక (అంటే సోమవారం తెల్లవారుజామున) 02 గంటల 25 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం వరకు గురుడు కొలువుదీరనున్నారు. గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన 'హంస మహాపురుష రాజయోగం' ఏర్పడబోతోంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ, ఈ మూడు రాశుల వారికి మాత్రం ఊహించని రీతిలో అదృష్టం వరించనుంది.
ఈ రాశులకు ఐదు నెలల వరకు బోలెడు లాభాలు
1.మేష రాశి
కర్కాటక రాశిలో గురుడి సంచారం మేష రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీరి జీవితంలోకి సుఖశాంతులు వెల్లువెత్తుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పురోగతి లభిస్తుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా, స్నేహితుల నుంచి కీలక సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలం. త్వరలోనే శుభవార్తలు వింటారు.
2.మకర రాశి
మకర రాశి వారికి ఈ గురు గోచారం విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి, అనుబంధం మరింత బలపడుతుంది. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.
{{/usCountry}}మకర రాశి వారికి ఈ గురు గోచారం విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి, అనుబంధం మరింత బలపడుతుంది. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.
{{/usCountry}}ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారులు గతంలో వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు గురుడి మార్పు వల్ల గోల్డెన్ డేస్ మొదలవుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పెద్ద ప్రాజెక్టులు లేదా డీల్స్ దక్కే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.
విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మీ పరపతి పెరగడమే కాకుండా, ఆర్థిక నిలకడ లభిస్తుంది.
గమనిక: పైన అందించిన సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మరియు పంచాంగం ఆధారంగా రూపొందించినది. ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన విశ్లేషణ కోసం నిపుణులైన సిద్ధాంతులను సంప్రదించడం ఉత్తమం.