ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం కనుక జ్యేష్ఠ పూర్ణిమ రాబోతోంది. జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 29, సోమవారం నాడు వచ్చింది. పూర్ణిమ తిథి జూన్ 29 తెల్లవారుజామున 3:06కి మొదలై, జూన్ 30 ఉదయం 5:26తో ముగుస్తుంది.

జ్యేష్ఠ పూర్ణిమ చాలా శుభప్రదమైన రోజు, అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున స్నానాలు, దానాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఉపవాసం, విష్ణు-శివ ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. జ్యేష్ఠ పూర్ణిమకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు స్నానాలు, దానాలు, ఉపవాసం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం, ఆరోజు చేసిన సత్కార్యాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.
జ్యేష్ఠ పూర్ణిమ రోజున చేయాల్సిన పరిహారాలు
1.చంద్రుడికి అర్ఘ్యం:
చంద్రోదయం తర్వాత పాలతో కలిపిన నీటిని లేదా స్వచ్ఛమైన నీటిని చంద్రుడికి సమర్పిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
2.పవిత్ర స్నానం:
ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నది లేదా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. ఆ తర్వాత పరిశుభ్రమైన దుస్తులను ధరించండి.
3.విష్ణు-లక్ష్మీదేవిని పూజించండి:
విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు.
4.తులసి పూజ:
తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కూడా కలుగుతాయి.
5.సత్యనారాయణ వ్రతం:
{{/usCountry}}తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కూడా కలుగుతాయి.
5.సత్యనారాయణ వ్రతం:
{{/usCountry}}ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా మంచిదే.
6.పితృ తర్పణం:
పితృదేవతలను స్మరిస్తూ తర్పణం చేయడం వలన పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.
7.రావి చెట్టు పూజ:
రావి చెట్టు వద్ద నీళ్లు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.
8.గాయత్రీ మంత్రం:
గాయత్రీ మంత్రం లేదా "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు.
9.పశు, పక్షులకు ఆహారం:
ఆవులకు పచ్చగడ్డి, పక్షులకు ధాన్యం, కుక్కలకు ఆహారం అందిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
10.దానాలు:
బియ్యం, గోధుమలు, నువ్వులు, నీటి కుండలు, వస్త్రాలు, అన్నదానం, పండ్లు వంటి దానాలు చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఎంతో పుణ్యం కలుగుతుంది. విష్ణువు, శివుని అనుగ్రహంతో ఆనందం రెట్టింపు అవుతుంది.