...
...
Next Story

Jyeshta Purnima 2026: జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ.. అదృష్టాన్ని మోసుకొస్తున్న గ్రహ సంచారం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేదు!

అపారమైన సంపదకు చిహ్నంగా భావించే జ్యేష్ఠ పూర్ణిమ త్వరలో రానుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తులు వేచి చూసే ఈ పవిత్ర దినాన, గ్రహాల గమనం నాలుగు రాశుల వారికి ఊహించని శుభఫలితాలను అందించబోతోంది. ఆ అదృష్ట రాశులు ఎవరో, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో ఈ కథనంలో చూద్దాం.

Published on: Jun 25, 2026, 11:00:48 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ కూడా చాలా విశేషమైనది. ఆ రోజు కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

Jyeshta Purnima 2026: జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ.. అదృష్టాన్ని మోసుకొస్తున్న గ్రహ సంచారం
Jyeshta Purnima 2026: జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ.. అదృష్టాన్ని మోసుకొస్తున్న గ్రహ సంచారం

జ్యేష్ఠ పూర్ణిమ తేదీ జూన్ 29, సోమవారం నాడు వచ్చింది. ఈ పూర్ణిమ తిథి జూన్ 29 ఉదయం 3:00 గంటలకు ప్రారంభమై, జూన్ 30వ తేదీ ఉదయం 5:26 గంటలకు ముగుస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే రాత్రి చంద్రుడికి పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం. మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.

జ్యేష్ఠ పూర్ణిమ 2026: 4 రాశుల వారికి అరుదైన అదృష్టకాలం, భారీగా లాభాలు!

1.సింహ రాశి

సింహ రాశి వారికి ఇది అద్భుతమైన సమయమని చెప్పొచ్చు. ఈ కాలం వారికి విశేషమైన ఫలితాలను తీసుకొస్తుంది. పని ప్రదేశంలో మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

2.వృశ్చిక రాశి

ధనస్సు రాశి వారికి ఇది మంచి సమయమని చెప్పొచ్చు. వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది. ప్రశాంతత, సంతోషం రెట్టింపు అవుతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. సరదాగా, సంతోషంగా ఈ సమయం అంతా సాగుతుంది.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి జ్యేష్ఠ పూర్ణిమ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీకు ఉన్న నెట్‌వర్క్‌ను సరిగ్గా వినియోగించుకుంటే భారీగా ప్రయోజనాలు లభిస్తాయి. కష్టానికి తగిన మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతతో ఉంటే మంచిది. చక్కటి మార్పులను చూస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe