వైశాఖ మాసం పూర్తయిపోయింది. జ్యేష్ఠ మాసం ఈరోజు నుంచి మొదలు కాబోతోంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అనేది మూడవ మాసం. ఈ నెలలో బ్రహ్మదేవుని ఆరాధించడం వలన ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. పితృదేవతల రుణాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ మాసం సరైనది. అలాగే పాపాలను పరిహరించుకోవడానికి, దైవ సేవలో లీనం అవ్వడానికి కావాల్సిన పుణ్య తిధులు జ్యేష్ఠ మాసంలో ఉంటాయి.

ఈ ఏడాది అధిక మాసం కూడా ఉంది. అంటే ఒక నెల ఎక్కువగా ఉంటుంది. అది కూడా జ్యేష్ఠ మాసమే ఎక్కువగా ఉంటుంది. అంటే 60 రోజుల పాటు జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఉన్న విశేష తిధులతో పాటుగా పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.
జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం
తెలుగు పంచాంగం ప్రకారం మే 2వ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం మొదలైంది. ఈ నెలలో కొన్ని తిధులు చాలా ప్రత్యేకమైనవి. ఆ రోజుల్లో దైవారాధన గురించి, ఈ మాసం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం జ్యేష్ఠ మాసంలో ఇలా చేయండి:
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి చాలా ఇష్టం. ఈ నెలలో బ్రహ్మదేవుడికి గోధుమ పిండితో దీపం చేసి పూజ చేయడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
నిర్జల ఏకాదశి:
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. ఏకాదశి వ్రతం చేసి పెసరపప్పు, పాయసం, నెయ్యి, గొడుగు, పానకం వంటి వాటిని దానం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను చేసిన పుణ్యం వస్తుంది.
రంభా తృతీయ:
జ్యేష్ఠ శుద్ధ తదియని రంభా తృతీయ అంటాము. ఈరోజు పార్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్ని రకాల దానాలు చేయడానికి కూడా ఇది చాలా మంచి రోజు. అన్నదానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
దశపాపహర దశమి:
{{/usCountry}}జ్యేష్ఠ శుద్ధ తదియని రంభా తృతీయ అంటాము. ఈరోజు పార్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్ని రకాల దానాలు చేయడానికి కూడా ఇది చాలా మంచి రోజు. అన్నదానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
దశపాపహర దశమి:
{{/usCountry}}జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. గంగా స్నానం లేదా ఏదైనా నదిలో స్నానం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. పదిసార్లు మునిగితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ రోజు నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లాన్ని నదిలో వేస్తే కూడా మంచిది.
వట సావిత్రి వ్రతం:
జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలందరూ కూడా వట సావిత్రి వ్రతం చేస్తారు. భర్త ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులు కావాలని కోరుకుంటారు.
మహా జ్యేష్ఠి (జ్యేష్ఠ పౌర్ణమి):
జ్యేష్ఠ పౌర్ణిమను మహా జ్యేష్ఠి అని అంటారు. ఇది కూడా చాలా విశేషమైన రోజు. ఆ రోజు దానాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఇది రైతులు జరుపుకునే పండుగ. ఎద్దులను అందంగా అలంకరించి, పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల దగ్గరికి తీసుకువచ్చి దుక్కి దున్నిస్తారు.
యోగినీ/సిద్ధ ఏకాదశి:
జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ ఏకాదశి లేదా సిద్ధ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే కూడా మంచి జరుగుతుంది.
ఇలా జ్యేష్ఠ మాసంలో చూసినట్లయితే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ జ్యేష్ఠ మాసంలో పైన చెప్పినట్లు ఆచరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.