హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి పండగకూ, తిథికీ ప్రత్యేక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. అందులోనూ కార్తీక శుక్ల నవమిని అక్షయ నవమిగా అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ విశేషమైన రోజునే ద్వాపర యుగం ప్రారంభమైందని, శ్రీకృష్ణ భగవానుడు ఇదే కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, కృష్ణుడు బృందావనం, గోకుల వీధులను వీడి మధురకు పయణమైన చారిత్రక ఘట్టం కూడా ఈ నవమితోనే ముడిపడి ఉంది.

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, శివుడు ఇద్దరి ఆశీస్సులు ఒకేసారి లభించే ఈ పర్వదినాన ఉసిరి చెట్టును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంతాన సౌభాగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తులు ఈ రోజు ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు.
మహాలక్ష్మి ప్రారంభించిన ఆచారం
ఈ పర్వదినం వెనుక ఒక సుందరమైన పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినప్పుడు, విష్ణువుతో పాటు శివుడిని ఇద్దరినీ ఒకేసారి పూజించాలని సంకల్పించింది. విష్ణు పూజకు తులసి, శివ పూజకు బిల్వత్రం ముఖ్యమైనప్పుడు, ఈ రెండింటినీ కలిపి ఏకకాలంలో ఎలా పూజించాలనే మీమాంసలో పడింది. అప్పుడే లక్ష్మీదేవికి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఉసిరి చెట్టులో తులసి, మారేడు రెండింటి గుణాలు లీనమై ఉంటాయని, ఆ చెట్టులో హరిహరులుద్దరూ నివసిస్తారని ఆమె గ్రహించింది.
అందుకే ఉసిరి చెట్టును విష్ణు-శివుల ప్రతీకగా భావించి లక్ష్మీదేవి భక్తిశ్రద్ధలతో పూజించింది. ఆమె భక్తికి మెచ్చి హరిహరులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత లక్ష్మీదేవి స్వయంగా ఉసిరి చెట్టు కిందే భోగ్య పదార్థాలు వండి వారికి వడ్డించింది. అప్పటి నుంచే ఈ నవమి రోజున ఉసిరి చెట్టు కింద పూజలు చేసి, అక్కడే భోజనం చేసే సంప్రదాయం వచ్చింది.
రాక్షస సంహారము
ఈ ప్రత్యేక రోజున శ్రీమహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు చేతిలో ఆ దైత్యుడు హతమైన తర్వాత, అతడి శరీరం నుంచి వచ్చిన రోమాల ద్వారా 'కూష్మాండ' (గుమ్మడికాయ) తీగ ఉద్భవించింది. అందుకే ఈ నవమి రోజున గుమ్మడికాయను దానం చేయడం వెనుక పెద్ద విశేషం దాగి ఉంది.
ఉసిరి చెట్టు ఆవిర్భావ రహస్యం
{{/usCountry}}ఈ ప్రత్యేక రోజున శ్రీమహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు చేతిలో ఆ దైత్యుడు హతమైన తర్వాత, అతడి శరీరం నుంచి వచ్చిన రోమాల ద్వారా 'కూష్మాండ' (గుమ్మడికాయ) తీగ ఉద్భవించింది. అందుకే ఈ నవమి రోజున గుమ్మడికాయను దానం చేయడం వెనుక పెద్ద విశేషం దాగి ఉంది.
ఉసిరి చెట్టు ఆవిర్భావ రహస్యం
{{/usCountry}}ఉసిరి చెట్టు ఎలా పుట్టిందనే అంశంపై పద్మ పురాణం, స్కంద పురాణాల్లో ప్రధానంగా రెండు గాథలు కనిపిస్తాయి. ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడి కళ్ల నుంచి రాలిపడిన ఆనంద బాష్పాల ద్వారా ఉసిరి చెట్టు ఉద్భవించిందని కొందరి నమ్మకం. ఇక సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించిన వేళ, భూమిపై చినుకులు పడటం వల్ల కూడా ఉసిరి వృక్షం వెలసిందని మరొక కథనం చెబుతుంది. అలాగే, విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూమిని ఉద్ధరిస్తున్నప్పుడు సంతోషంతో ఆయన కళ్ల నుంచి జారిన కన్నీటి బిందువుల నుంచి ఈ వృక్షం పుట్టుకొచ్చిందని చెబుతారు.
దాన ధర్మాలతో అక్షయ ఫలితం
కార్తీక శుక్ల నవమి నుంచి పౌర్ణమి వరకు శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టుపైనే నివసిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ ఐదు రోజులు ఉసిరి చెట్టుకు చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ పర్వదినాన చేసే జపం, తపస్సు, దానం మరియు పూజా కార్యక్రమాల ఫలితం ఎప్పటికీ తరగకుండా 'అక్షయం'లా నిలిచిపోతుంది.