...
...
Next Story

Karthika Amavasya 2025: నవంబర్ 20న కార్తీక అమావాస్య వేళ ఈ రాశులకు సమస్యలు రావచ్చు.. జాగ్రత్త సుమా!

ఇక కార్తీక మాసం పూర్తి కాబోతోంది. కార్తీక అమావాస్య నవంబర్ 20న రాబోతోంది. అయితే ఈ అమావాస్య నాడు చంద్రుడు బలహీనంగా ఉండడంతో, కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ రాశులు వారు ఎవరు? ఏ రాశులు వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

Published on: Nov 18, 2025, 10:00:08 IST
Advertisement

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి, శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. శివ, కేశవులను ప్రత్యేకించి ఈ మాసంలో ఆరాధిస్తారు. ఇక కార్తీక మాసం పూర్తి కాబోతోంది. కార్తీక అమావాస్య నవంబర్ 20న రాబోతోంది. అయితే ఈ అమావాస్య నాడు చంద్రుడు బలహీనంగా ఉండడంతో, కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ రాశులు వారు ఎవరు? ఏ రాశులు వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రతికూల ఫలితాలు రావచ్చు

కార్తీక అమావాస్య నాడు ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది (pinterest)
కార్తీక అమావాస్య నాడు ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది (pinterest)

అమావాస్య కొన్నిసార్లు సానుకూల ఫలితాలను తీసుకొస్తే, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అయితే ఈ కార్తీక అమావాస్యనాడు కొన్ని రాశుల వారిపై చెడ్డ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈసారి కార్తీకమాస అమావాస్య నవంబర్ 20న వచ్చింది. ఆ రోజు కొన్ని రాశులు వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ఆ రాశులు వారు ఎవరు అనేది ఇప్పుడే చూసేద్దాం.

కార్తీక అమావాస్య నాడు ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉంటే మంచిది

1.మిథున రాశి

మిథున రాశి వారికి నవంబర్ 20న చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మాటలే మీకు సమస్యలను కలిగించే అవకాశం ఉంది. మీరు మౌనంగా ఉంటేనే మంచిది, లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి కూడా తగ్గుతుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి కార్తీక అమావాస్య నాడు కొన్ని సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

3.కర్కాటక రాశి

మకర రాశి వారికి ఈ కార్తీక మాసంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా అది పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు రావచ్చు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks