కార్తీక మాసం 2026: ఈ 4 రాశులకు రాజయోగం.. ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తులా, కుంభ, మకర, కన్యా రాశుల వారికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Published on: Nov 10, 2026, 12:30:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఈరోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. కార్తీక మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన రాజయోగాలు ఏర్పడిపోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థికపరంగా లాభాలను పొందడమే కాదు, ఆఫీసులో కూడా బాగా కలిసి రాబోతోంది. పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంది. కార్తీక మాసం మొదటి రోజు నుంచే అదృష్టాన్ని పొందే రాశులు ఏవి? ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

కార్తీక మాసం 2026: ఈ 4 రాశులకు రాజయోగం.. ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు! (AI)
కార్తీక మాసం 2026: ఈ 4 రాశులకు రాజయోగం.. ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు! (AI)

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి అనుకూలంగా ఉంటే, ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటుంది. ఈ ప్రభావం 12 రాశులపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం లాభాలను పొందే అవకాశం ఉంది.

కార్తీక మాసంలో ఈ రాశుల వారికి పండగే.. విపరీతమైన లాభాలు, రాజయోగాలు

తులా రాశి

తులా రాశి వారికి ధనస్థానంలో రవి ఉండడం వలన లాభాలు కలిగే అవకాశం ఉంది. అలాగే లాభ స్థానంలో కుజ సంచారం జరుగుతుండడంతో ఈ రాశి వారికి కార్తీక మాసంలో బాగా కలిసి రాబోతోంది. ధనలాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అధికారుల నుంచి తులా రాశి వారు ప్రశంసలను పొందుతారు. వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు ఉండడం, దశమ స్థానంలో రవి ఉండడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మంచి ఆఫర్లను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. ప్రమోషన్లను పొందాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఎప్పటినుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ కార్తీక మాసంలో శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మకర రాశి

మకర రాశి వారికి కార్తీక మాసం ఆర్థికంగా పురోగతిని తీసుకొస్తుంది. ఈ సమయం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కష్టాలు తొలగిపోతాయి. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయం బాగా ఫలిస్తుంది. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికల కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి కార్తీక మాసంలో ఆర్థికంగా శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. కార్తీక మాసం కన్యా రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలు విజయవంతంగా ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెడితే ఆర్థికపరంగా మీకు బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More