...
...
Next Story

కార్తీక మాసంలో కుజుడు, సూర్యుడి సంచారంతో ఐదు రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు, లక్కుతో పాటు ఎన్నో!

కార్తీక మాసంలో గ్రహాల సంచారంలో చోటుచేసుకుంటున్న మార్పులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందించనున్నాయి. నవంబర్ 12న కుజుడు సింహ రాశిలోకి, నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో పలు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Published on: Nov 23, 2026, 11:00:14 IST
Advertisement

కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక మాసంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. కార్తీక మాసంలో అదృష్టం పొందే రాశులు ఎవరు? ఏయే రాశుల వారికి కార్తీక మాసం బాగా కలిసి వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో కుజుడు, సూర్యుడి సంచారంతో ఐదు రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు, లక్కుతో పాటు ఎన్నో!
కార్తీక మాసంలో కుజుడు, సూర్యుడి సంచారంతో ఐదు రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు, లక్కుతో పాటు ఎన్నో!

కార్తీక మాసంలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు జరగబోతున్నాయి. నవంబర్ 12, గురువారం నాడు కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. అలాగే నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీంతో పాటు కొన్ని గ్రహాల సంచారంతో పలు రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

కార్తీక మాసంలో ఏ రాశుల వారికి రాజయోగం విపరీతంగా కలిసి వస్తుంది?

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి సూర్య, కుజ గ్రహాల వల్ల కార్తీక మాసంలో బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ధన పంచమ భావానికి చెందిన గ్రహాల ప్రభావం ఉండడంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డిసెంబర్ 9 నాటికి కర్కాటక రాశి వారు కెరీర్‌లో పురోగతిని చూస్తారు. అలాగే ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్ ద్వారా బాగా కలిసి వస్తుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలను కూడా వింటారు.

వృషభ రాశి

సింహ రాశి వారికి కార్తీక మాసం అద్భుతంగా కలిసి వస్తుంది. శుభప్రదమైన ఫలితాలను చూస్తారు. కుజుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుని సంచారం కారణంగా పురోగతిని చూస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. కార్తీక మాసం బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. సూర్యుడు సంపదకు అధిపతి కాబట్టి, ఆయన ఇంట్లో కుజుడు లాభ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి వారికి కార్తీక మాసం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు, భూమి, పెట్టుబడులకు సంబంధించిన వాటిల్లో రాబడిని చూస్తారు. ఎప్పటినుంచో పూర్తికాని పనులు కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తయిపోతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి కార్తీక మాసం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పురోగతి ఉంటుంది. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం, సూర్యుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కార్తీక మాసంలో కుంభ రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. ఉద్యోగస్తులకు లాభాలు కనిపిస్తాయి. రాజకీయాల్లో ప్రజాదరణ పెరుగుతుంది. ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద కార్తీక మాసం ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది.

 

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks