ఈరోజే అక్షయ నవమి. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ నెలలో వచ్చే అక్షయ నవమి కూడా చాలా విశేషమైనది. ఈరోజు చేసే పూజలు, జపాలు, తపస్సు, దానధర్మాలతో ఎంతో పుణ్యఫలాన్ని పొందవచ్చు.

అలాగే అక్షయ నవమి నాడు చేసే దానాలు ఏవి? వేటిని దానం చేయడం వలన అక్షయ పుణ్యం లభిస్తుంది? పురాణాలు ఏం చెబుతున్నాయి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నదానం
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని హిందూ ధర్మంలో చెబుతారు. అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవాళ్లకు అన్నాన్ని అందిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అక్షయ నవమి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఏర్పాటు చేసి అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం వలన బంధాలు బలపడతాయి. అలాగే ఈ పర్వదినం నాడు చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తారు.
ఉసిరికాయ దానం
అక్షయ నవమి నాడు ఉసిరి చెట్టును పూజించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఉసిరి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు. అందుకనే ఉసిరి చెట్టును మహావృక్షంగా చెబుతారు. ఈరోజు ఉసిరికాయలను దానం చేస్తే కూడా మంచిది.
వస్త్రదానం
అక్షయ నవమి నాడు వస్త్రదానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అవసరమైన వారికి కొత్త బట్టలు లేదా ఉపయోగించడానికి అనువైన శుభ్రమైన వస్త్రాలను ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
గుమ్మడికాయ దానం
అక్షయ నవమి నాడు గుమ్మడికాయను దానం చేయడం మంచిదే. దీనిని దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు, అతని శరీరం నుంచి గుమ్మడికాయ తీగ ఉద్భవించిందని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ఆరోజు గుమ్మడికాయ దానం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
దీపదానం
{{/usCountry}}అక్షయ నవమి నాడు గుమ్మడికాయను దానం చేయడం మంచిదే. దీనిని దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు, అతని శరీరం నుంచి గుమ్మడికాయ తీగ ఉద్భవించిందని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ఆరోజు గుమ్మడికాయ దానం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
దీపదానం
{{/usCountry}}కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా మంచిది. దేవాలయాల్లో లేదా పవిత్రమైన ప్రదేశాల్లో దీపాలను వెలిగించి, నూనె లేదా దీప సామగ్రిని అవసరమైన వారికి ఇస్తే శుభఫలితాలు కలుగుతాయి.
అక్షయ నవమి దానాల వెనుక ఉన్న విశిష్టత
అక్షయ నవమి నాడు చేసే దానాలు అక్షయ పుణ్యఫలితాన్ని అందిస్తాయి. దానంలో వస్తువు విలువ కంటే దానం చేసే వ్యక్తి మనసు నిస్వార్థమైనదిగా ఉండటం ముఖ్యం.
ఉసిరి చెట్టు - లక్ష్మీదేవి
ఒకసారి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినప్పుడు, విష్ణువుతో పాటు శివుడిని కూడా ఒకేసారి పూజించాలని అనుకుంటుంది. విష్ణుమూర్తి ఆరాధనకు తులసి దళాలు, శివుడి పూజకు బిల్వపత్రాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటినీ ఒకేసారి సమర్పించి హరిహరులను ఆరాధించే మార్గం గురించి ఆమె ఆలోచించింది. అప్పుడు ఉసిరి చెట్టులో తులసి, మారేడు వృక్షాల దైవిక గుణాలు ఉన్నాయని, ఈ చెట్టులో హరిహరులు ఇద్దరూ కొలువై ఉంటారని తెలుస్తుంది.