...
...
Next Story

కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగించాలి, ఈ నెలలో ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే శివ కేశవుల అనుగ్రహం కలుగుతుంది!

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివుడికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో దీపారాధన, వ్రతాలు, పూజలు, దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ తులసి కోట దగ్గర, దేవాలయాల్లో దీపాలు వెలిగించడం పవిత్రమైన ఆచారంగా భావిస్తారు.

Published on: Nov 9, 2026, 16:00:36 IST
Advertisement

కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ నెలలో చేసే వ్రతాలు, పూజలు, దీపారాధన ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం తులసి కోట దగ్గర, దేవాలయాల్లో కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో దీపారాధన ప్రాధాన్యత

కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగించాలి, ఈ నెలలో ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే శివ కేశవుల అనుగ్రహం కలుగుతుంది! (AI)
కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగించాలి, ఈ నెలలో ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే శివ కేశవుల అనుగ్రహం కలుగుతుంది! (AI)

హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే దీపం జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక. దీపంలోని వెలుగు అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును అందిస్తుంది. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం వలన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యకరంగా భావిస్తారు. కార్తీక సోమవారం రోజున శివుడి సన్నిధిలో దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలితం దక్కుతుంది.

తులసి కోట దగ్గర దీపాన్ని ఎందుకు వెలిగించాలి?

తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. రోజూ సాయంత్రం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. దీపారాధన చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించే అవకాశం కూడా మనకు లభిస్తుంది.

కార్తీక మాసంలో రోజూ చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు

ఇలా చేయడం వలన శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ తప్పకుండా ఈ ఐదు పనులు చేయాలి.

1. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి

కార్తీక మాసంలో శివుడిని ఆరాధించాలి. ప్రతిరోజూ శివలింగానికి నమస్కరించి, నీటితో అభిషేకం చేయాలి. మారేడు దళాలు, పూలు సమర్పించి శివుడిని ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

3. తులసి మొక్కను ఆరాధించాలి

కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రోజూ తులసి మొక్కకు నీళ్లు పోసి, పసుపు, కుంకుమలు సమర్పించాలి. తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయాలి.

4. సాయంత్రం దీపారాధన చేయాలి

కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం మంచిది.

5. దానధర్మాలు, అన్నదానం చేయాలి

కార్తీక మాసంలో చేసే దానధర్మాలకు కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పేదలకు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. కుదిరితే ఇతరులకు సాయం చేయండి. భగవంతుని సేవలో దానాలు కూడా భాగమే అని గుర్తుపెట్టుకోవాలి.

కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించాలి?

కార్తీక మాసంలో వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ప్రశాంతంగా ఉండాలి. ఇతరుల పట్ల కోపానికి గురవడం మంచిది కాదు.

కుటుంబ ఆచారాలకు అనుగుణంగా వ్రతాలు, ఉపవాసాలు చేయాలి.

ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ కొంత సమయం దైవచింతనకు కేటాయించాలి. మంచి పనులు చేయాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks