...
...
Next Story

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? వీటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది!

కార్తీక మాసంలో నది స్నానం, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. వీటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది

Published on: Nov 3, 2025, 13:30:14 IST
Advertisement

కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నది స్నానం, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది.

కార్తీక పౌర్ణమి 2025

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? (pinterest)
Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? (pinterest)

గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. దేవతలను ఆ రాక్షసుడి దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు. దీంతో దేవతలందరూ సంతోషంతో శివుడికి దీపాలు వెలిగించారు. ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్నిపురాణంలో చెప్పబడింది.

365 వత్తులు

కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. అలా 365 వత్తులు వెలిగించడం వలన సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుంది. నారాయణుడిని, శివుడిని కలిసి పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

  1. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి.
  2. నదిలో దీపాలను దానం చేస్తే మంచిది. అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి.
  3. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
  4. చంద్రుడికి పచ్చిపాలను నీటిలో కలిపి అర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.
  5. ఈరోజు గోదానం చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  6. బెల్లం, దుస్తులు వంటి వాటిని పేదలకు దానం చేస్తే మనిషికి శుభం జరుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు చేయకూడనివి..

  • కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి.
  • కార్తీక పౌర్ణమి నాడు మాంసాహారం తినడం మంచిది కాదు.
  • ఇంటికి వచ్చిన పేదలు, నిస్సహాయులను ఖాళీ చేతులతో పంపించడం మంచిది కాదు.
  • పెద్దవారిని అవమానించడం, అసభ్యకరంగా మాట్లాడడం కూడా మంచిది కాదు.

కార్తీక పౌర్ణమి నాడు ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe