నాలుగు నెలల యోగనిద్ర తర్వాత శ్రీమహావిష్ణువు మేల్కొనే ఈ పర్వదినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 21న అంటే ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది. దీనినే దేవ ఉత్థాని ఏకాదశి అంటారు. శాస్త్ర వచనాల ప్రకారం దశమితో కూడిన ఏకాదశి కంటే, ద్వాదశితో కూడిన ఏకాదశికి ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్ఠం. నవంబర్ 21న ద్వాదశి ఘడియలతో కూడిన ఏకాదశి రావడం ఎంతో శుభప్రదమని, దీనికి త్రయోదశి తిథి కూడా తోడైతే వ్రత ఫలితం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
మూడు రోజుల వ్రత నియమాలు: దశమి నుంచే ఆరంభం

ఏకాదశి ఉపవాసం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, దీని నియమాలు దశమి తిథి నుంచే మొదలవుతాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి.. ఇలా మొత్తం మూడు రోజుల పాటు భక్తులు అత్యంత నిష్ఠతో, భగవంతుడి నామస్మరణలో గడపాలి. దశమి రోజున కేవలం ఒక్క పూట మాత్రమే సాత్విక భోజనం చేయాలి, సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోకూడదు.
ఏకాదశి నాడు చేయకూడని 11 పనులు
ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే ఏకాదశి నాడు జూదం ఆడటం, పగటిపూట నిద్రపోవడం, తాంబూలం వేసుకోవడం, ఇతరులను నిందించడం, చాడీలు చెప్పడం, దొంగతనం, హింసకు పాల్పడటం, కోపగించుకోవడం, అబద్ధాలు ఆడటం, బ్రహ్మచర్యం తప్పడం, మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోవడం మంచిది కాదు. వీటికి తప్పక దూరంగా ఉండాలి.
ద్వాదశి పారణ రోజున పాటించాల్సిన 12 నియమాలు
ఉపవాసం విరమించే ద్వాదశి రోజున కూడా కఠిన నియమాలు వర్తిస్తాయి. ఈ రోజున కంచు పాత్రల్లో తినడం, మినుములు, మద్యం, తేనె, నూనె పదార్థాలు, ఎర్ర కందిపప్పు తీసుకోకూడదు. అంతేకాకుండా చెడు ప్రవర్తన గలవారితో మాట్లాడటం, కఠిన వ్యాయామం చేయడం, సుదూర ప్రయాణాలు చేయడం, రెండుసార్లు భోజనం చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండి వ్రతాన్ని పూర్తి చేయాలి.
24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?
ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ప్రతి నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది.
{{/usCountry}}ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ప్రతి నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది.
{{/usCountry}}ఈరోజే మహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుంచి మేల్కొంటారని, అందుకే దీనిని దేవుత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉపవాసం ఉండడం కూడా మంచిదే. ఈ పవిత్రమైన రోజున విష్ణువును మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన అనుగ్రహం పొందడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
ఈ ఏకాదశి వేళ ఏం చెయ్యాలి?
విష్ణువును, లక్ష్మీదేవిని ఈ రోజు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. విష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి అలంకరించాలి.
విష్ణుమూర్తికి తులసి దళాలను కచ్చితంగా సమర్పించండి.
అలాగే పసుపు, కుంకుమలు, పూలు సమర్పించండి.
నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాలు చదువుకోండి.
వీలైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించాలి.
సాయంత్రం దీపారాధన చేసి మళ్లీ విష్ణు నామస్మరణ చేసుకోవాలి.
తర్వాత రోజు ద్వాదశి తిథిలో ఉపవాసాన్ని విరమించాలి.