ఈరోజే కార్తీక శుక్ల ఏకాదశి.. 24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఈ పనులు చేయండి!

కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని దేవుత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. నాలుగు నెలల యోగనిద్ర తర్వాత శ్రీమహావిష్ణువు ఈ రోజున మేల్కొంటారని హిందూ సంప్రదాయంలో విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధించడం వల్ల పుణ్యఫలాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. 

Published on: Nov 20, 2026, 08:00:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నాలుగు నెలల యోగనిద్ర తర్వాత శ్రీమహావిష్ణువు మేల్కొనే ఈ పర్వదినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 21న అంటే ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది. దీనినే దేవ ఉత్థాని ఏకాదశి అంటారు. శాస్త్ర వచనాల ప్రకారం దశమితో కూడిన ఏకాదశి కంటే, ద్వాదశితో కూడిన ఏకాదశికి ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్ఠం. నవంబర్ 21న ద్వాదశి ఘడియలతో కూడిన ఏకాదశి రావడం ఎంతో శుభప్రదమని, దీనికి త్రయోదశి తిథి కూడా తోడైతే వ్రత ఫలితం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.

ఈరోజే కార్తీక శుక్ల ఏకాదశి.. 24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఈ పనులు చేయండి! (AI)
ఈరోజే కార్తీక శుక్ల ఏకాదశి.. 24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఈ పనులు చేయండి! (AI)

మూడు రోజుల వ్రత నియమాలు: దశమి నుంచే ఆరంభం

ఏకాదశి ఉపవాసం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, దీని నియమాలు దశమి తిథి నుంచే మొదలవుతాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి.. ఇలా మొత్తం మూడు రోజుల పాటు భక్తులు అత్యంత నిష్ఠతో, భగవంతుడి నామస్మరణలో గడపాలి. దశమి రోజున కేవలం ఒక్క పూట మాత్రమే సాత్విక భోజనం చేయాలి, సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోకూడదు.

ఏకాదశి నాడు చేయకూడని 11 పనులు

ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే ఏకాదశి నాడు జూదం ఆడటం, పగటిపూట నిద్రపోవడం, తాంబూలం వేసుకోవడం, ఇతరులను నిందించడం, చాడీలు చెప్పడం, దొంగతనం, హింసకు పాల్పడటం, కోపగించుకోవడం, అబద్ధాలు ఆడటం, బ్రహ్మచర్యం తప్పడం, మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోవడం మంచిది కాదు. వీటికి తప్పక దూరంగా ఉండాలి.

ద్వాదశి పారణ రోజున పాటించాల్సిన 12 నియమాలు

ఉపవాసం విరమించే ద్వాదశి రోజున కూడా కఠిన నియమాలు వర్తిస్తాయి. ఈ రోజున కంచు పాత్రల్లో తినడం, మినుములు, మద్యం, తేనె, నూనె పదార్థాలు, ఎర్ర కందిపప్పు తీసుకోకూడదు. అంతేకాకుండా చెడు ప్రవర్తన గలవారితో మాట్లాడటం, కఠిన వ్యాయామం చేయడం, సుదూర ప్రయాణాలు చేయడం, రెండుసార్లు భోజనం చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండి వ్రతాన్ని పూర్తి చేయాలి.

24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?

ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ప్రతి నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది.

ఈరోజే మహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుంచి మేల్కొంటారని, అందుకే దీనిని దేవుత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉపవాసం ఉండడం కూడా మంచిదే. ఈ పవిత్రమైన రోజున విష్ణువును మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన అనుగ్రహం పొందడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి.

ఈ ఏకాదశి వేళ ఏం చెయ్యాలి?

విష్ణువును, లక్ష్మీదేవిని ఈ రోజు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. విష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి అలంకరించాలి.

విష్ణుమూర్తికి తులసి దళాలను కచ్చితంగా సమర్పించండి.

అలాగే పసుపు, కుంకుమలు, పూలు సమర్పించండి.

నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాలు చదువుకోండి.

వీలైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించాలి.

సాయంత్రం దీపారాధన చేసి మళ్లీ విష్ణు నామస్మరణ చేసుకోవాలి.

తర్వాత రోజు ద్వాదశి తిథిలో ఉపవాసాన్ని విరమించాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More