...
...
Next Story

కార్తీక సోమవారం + కోటి సోమవారం: ఈరోజు సాయంత్రం ఈ 5 పరిహారాలు పాటిస్తే.. శివుడి అనుగ్రహం, ఆర్థిక సమస్యలు మాయం!

ఈరోజు కార్తీక సోమవారంతో పాటు కోటి సోమవారం కూడా కలిసి రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, ఉపవాసం ఉండటం, శివాలయ దర్శనం, దీపారాధన, శివనామస్మరణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Published on: Nov 16, 2026, 14:00:42 IST
Advertisement

ఈరోజు చాలా విశేషమైన కార్తీక సోమవారం. కోటి సోమవారం కూడా ఈరోజు కలిసి రావడం జరిగింది. కార్తీక మాసంలో సోమవారానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కోటి సోమవారం కూడా ఈరోజు కలిసి రావడంతో ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు.

కార్తీక సోమవారం + కోటి సోమవారం: ఈరోజు సాయంత్రం ఈ 5 పరిహారాలు పాటిస్తే.. శివుడి అనుగ్రహం, ఆర్థిక సమస్యలు మాయం! (AI)
కార్తీక సోమవారం + కోటి సోమవారం: ఈరోజు సాయంత్రం ఈ 5 పరిహారాలు పాటిస్తే.. శివుడి అనుగ్రహం, ఆర్థిక సమస్యలు మాయం! (AI)

ఈ నెలలో పరమేశ్వరుడికి అత్యంత భక్తితో పూజలు చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండడం, శివాలయాలకు వెళ్లడం, దీపారాధన చేయడం, శివనామస్మరణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.

కార్తీక సోమవారం+ కోటి సోమవారం

ఈరోజు కార్తీక సోమవారం, కోటి సోమవారం వేళ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారాలను పాటిస్తే మంచి మార్పులను చూడొచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందడానికి మంత్రాన్ని జపించండి

ఈరోజు విశేషమైన కార్తీక సోమవారం, కోటి సోమవారం కనుక సాయంత్రం శివుడి ముందు కూర్చుని భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ధైర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. అలాగే అప్పుల బాధలు తగ్గాలని శివుడిని ప్రార్థించండి. పూజ పూర్తయ్యాక ప్రశాంతంగా కూర్చుని శివుడిని ధ్యానించండి. ఆర్థిక సమస్యలు పరిష్కారమై అప్పుల నుంచి బయటపడొచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

శివుడికి అభిషేకం

శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను కచ్చితంగా ఈరోజు సమర్పించండి. వీటిని సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంపద, సంతోషం కలుగుతాయి.

అన్నదానం చేయండి

కార్తీక మాసంలో అన్నదానం చేయడం చాలా మంచిది. కార్తీక సోమవారం నాడు సాధ్యమైనంత మేరకు పేదలకు అన్నదానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. దానధర్మాలు చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.

ఈరోజు కార్తీక సోమవారం వేళ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి.

సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

శివనామస్మరణ, మంత్ర జపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కాసేపు సమయాన్ని వీటి కోసం కేటాయించండి.

సాధ్యమైనంత వరకు సాత్వికాహారం తీసుకోవడం మంచిది.

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఆచరణాత్మక ప్రణాళికలను రూపొందించుకుంటే మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks