జ్యోతిష్య శాస్త్రంలో కేతువును సాధారణంగా మోక్ష కారకుడిగా, నిర్లిప్తతను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. కేతు మహాదశ కాలం అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత లోతైన, ఊహించని మార్పులకు దారితీస్తుంది. ఈ సమయంలో చాలా మందికి ప్రాపంచిక విషయాలపై, పాత అనుబంధాలపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. మనస్సు భౌతిక సుఖాల నుండి దూరమై, కొత్త ఆధ్యాత్మిక లేదా మానసిక దిశ వైపు అడుగులు వేస్తుంది. అయితే, కేతు మహాదశ అందరికీ చెడు చేయదు, అలా అని అందరికీ మంచి కూడా చేయదు.

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం…. ఏ గ్రహం కూడా అందరికీ పూర్తిగా శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఇవ్వదు. సరైన జాతక బలం, లగ్న స్థితి ఉన్నప్పుడు కేతువు జీవితాన్నే మార్చేసే అద్భుతమైన మార్పులను తెస్తాడు. కేతువు ప్రభావం లేకుండా జీవితంలో పెద్ద స్థాయి ఎదుగుదల గానీ, సానుకూల పరివర్తన గానీ సాధ్యం కావు. అదే సమయంలో జాతకంలో కేతువు ప్రతికూల స్థానంలో ఉంటే మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనలు, భయాలు, నష్టాలను కలిగిస్తాడు.
ఏ రాశుల వారికి శుభం? ఎవరికి సవాళ్లు?
కేతు మహాదశ కొన్ని లగ్నాలు, రాశుల వారికి అమితమైన ప్రయోజనాలను అందిస్తుంది.
- మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారికి కేతువు పెద్ద ఎత్తున సానుకూల మార్పులు తెస్తాడు.
- వృషభం, మిథునం, కన్య, తులా, మకరం, కుంభం: ఈ రాశుల వారికి కేతు ప్రభావం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
కేతువు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు, వ్యాపార రంగంలో ఊహించని పెద్ద మార్పులను, వ్యూహాత్మక విజయాలను కూడా అందిస్తాడు. ఒకవేళ జాతకంలో కేతు స్థితి బలహీనంగా ఉంటే.. మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిస చేయడం, నిరంతరం భయపెట్టడం, కుటుంబంలో ఇబ్బందులకు గురిచేయడం వంటి సమస్యలు సృష్టిస్తాడు.
కేతు మహాదశలో వైరాగ్యం ఎందుకు ?
కేతువు స్వభావమే విరక్తికి, నిర్లిప్తతకు దారితీయడం. తన 7 సంవత్సరాల మహాదశ కాలంలో మనస్సును క్రమంగా భౌతిక సుఖాలకు అతీతంగా తీసుకెళ్తాడు. పాత అలవాట్లు, సంబంధాలు, ఆశయాలు గతంలో లాగా ఆకర్షణీయంగా కనిపించవు. బాహ్య విషయాలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవని వ్యక్తి అంతర్గతంగా గుర్తిస్తాడు. ఈ కారణంతోనే మోహం తగ్గి, అంతఃశాంతి, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈ మార్పు ఒక్కరోజులో రాకుండా క్రమక్రమంగా వచ్చి జీవిత దిశను మార్చేస్తుంది.
{{/usCountry}}కేతువు స్వభావమే విరక్తికి, నిర్లిప్తతకు దారితీయడం. తన 7 సంవత్సరాల మహాదశ కాలంలో మనస్సును క్రమంగా భౌతిక సుఖాలకు అతీతంగా తీసుకెళ్తాడు. పాత అలవాట్లు, సంబంధాలు, ఆశయాలు గతంలో లాగా ఆకర్షణీయంగా కనిపించవు. బాహ్య విషయాలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవని వ్యక్తి అంతర్గతంగా గుర్తిస్తాడు. ఈ కారణంతోనే మోహం తగ్గి, అంతఃశాంతి, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈ మార్పు ఒక్కరోజులో రాకుండా క్రమక్రమంగా వచ్చి జీవిత దిశను మార్చేస్తుంది.
{{/usCountry}}పైన పేర్కొన్న మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి కేతువు జీవితానికి కొత్త వెలుగును ఇస్తాడు. కెరీర్‌లో అనూహ్య పురోగతి, ఆలోచనలో పరిపక్వత, ఆధ్యాత్మిక ఉన్నతి కనిపిస్తాయి. పాత అడ్డంకులు, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయి, భవిష్యత్తుకు సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కేతువు అనుగ్రహంతో జీవితంలో స్థిరత్వం, స్పష్టత ఏర్పడతాయి.
వృషభం, మిథునం, కన్య, తులా, మకరం, కుంభ రాశుల వారికి కేతువు వలస మానసిక గందరగోళం, కారణం లేని భయం, అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. చెడు సావాసాలు లేదా ప్రతికూల ఆలోచనల వైపు మనస్సు మళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, నిగ్రహం పాటించడం చాలా అవసరం. సరైన జ్యోతిష్య మార్గదర్శకత్వం పొంది నడుచుకుంటే నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
కేతువును చూసి భయపడాల్సిన పనిలేదు. అది కేవలం త్యాగానికి మాత్రమే సూచిక కాదు, వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉన్న గ్రహం. క్రమం తప్పకుండా దైవారాధన, సాత్విక జీవనశైలి, సహనం పాటించడం ద్వారా కేతు మహాదశను జయించి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు.