కేతు మహాదశ : ఈ 6 రాశుల వారికి లక్కీ ఛాన్స్ - మిగతా వారు అప్రమత్తంగా ఉండాలి!
జ్యోతిష్యం ప్రకారం కేతు మహాదశ జీవితంలో మార్పులు తెస్తుంది. 6 రాశుల వారికి అద్భుతమైన యోగం ఉండగా… మరికొందరికి సవాళ్లు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రంలో కేతువును సాధారణంగా మోక్ష కారకుడిగా, నిర్లిప్తతను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. కేతు మహాదశ కాలం అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత లోతైన, ఊహించని మార్పులకు దారితీస్తుంది. ఈ సమయంలో చాలా మందికి ప్రాపంచిక విషయాలపై, పాత అనుబంధాలపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. మనస్సు భౌతిక సుఖాల నుండి దూరమై, కొత్త ఆధ్యాత్మిక లేదా మానసిక దిశ వైపు అడుగులు వేస్తుంది. అయితే, కేతు మహాదశ అందరికీ చెడు చేయదు, అలా అని అందరికీ మంచి కూడా చేయదు.

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం…. ఏ గ్రహం కూడా అందరికీ పూర్తిగా శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఇవ్వదు. సరైన జాతక బలం, లగ్న స్థితి ఉన్నప్పుడు కేతువు జీవితాన్నే మార్చేసే అద్భుతమైన మార్పులను తెస్తాడు. కేతువు ప్రభావం లేకుండా జీవితంలో పెద్ద స్థాయి ఎదుగుదల గానీ, సానుకూల పరివర్తన గానీ సాధ్యం కావు. అదే సమయంలో జాతకంలో కేతువు ప్రతికూల స్థానంలో ఉంటే మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనలు, భయాలు, నష్టాలను కలిగిస్తాడు.
ఏ రాశుల వారికి శుభం? ఎవరికి సవాళ్లు?
కేతు మహాదశ కొన్ని లగ్నాలు, రాశుల వారికి అమితమైన ప్రయోజనాలను అందిస్తుంది.
- మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారికి కేతువు పెద్ద ఎత్తున సానుకూల మార్పులు తెస్తాడు.
- వృషభం, మిథునం, కన్య, తులా, మకరం, కుంభం: ఈ రాశుల వారికి కేతు ప్రభావం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
కేతువు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు, వ్యాపార రంగంలో ఊహించని పెద్ద మార్పులను, వ్యూహాత్మక విజయాలను కూడా అందిస్తాడు. ఒకవేళ జాతకంలో కేతు స్థితి బలహీనంగా ఉంటే.. మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిస చేయడం, నిరంతరం భయపెట్టడం, కుటుంబంలో ఇబ్బందులకు గురిచేయడం వంటి సమస్యలు సృష్టిస్తాడు.
కేతు మహాదశలో వైరాగ్యం ఎందుకు ?
కేతువు స్వభావమే విరక్తికి, నిర్లిప్తతకు దారితీయడం. తన 7 సంవత్సరాల మహాదశ కాలంలో మనస్సును క్రమంగా భౌతిక సుఖాలకు అతీతంగా తీసుకెళ్తాడు. పాత అలవాట్లు, సంబంధాలు, ఆశయాలు గతంలో లాగా ఆకర్షణీయంగా కనిపించవు. బాహ్య విషయాలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవని వ్యక్తి అంతర్గతంగా గుర్తిస్తాడు. ఈ కారణంతోనే మోహం తగ్గి, అంతఃశాంతి, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈ మార్పు ఒక్కరోజులో రాకుండా క్రమక్రమంగా వచ్చి జీవిత దిశను మార్చేస్తుంది.
పైన పేర్కొన్న మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి కేతువు జీవితానికి కొత్త వెలుగును ఇస్తాడు. కెరీర్‌లో అనూహ్య పురోగతి, ఆలోచనలో పరిపక్వత, ఆధ్యాత్మిక ఉన్నతి కనిపిస్తాయి. పాత అడ్డంకులు, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయి, భవిష్యత్తుకు సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కేతువు అనుగ్రహంతో జీవితంలో స్థిరత్వం, స్పష్టత ఏర్పడతాయి.
వృషభం, మిథునం, కన్య, తులా, మకరం, కుంభ రాశుల వారికి కేతువు వలస మానసిక గందరగోళం, కారణం లేని భయం, అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. చెడు సావాసాలు లేదా ప్రతికూల ఆలోచనల వైపు మనస్సు మళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, నిగ్రహం పాటించడం చాలా అవసరం. సరైన జ్యోతిష్య మార్గదర్శకత్వం పొంది నడుచుకుంటే నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
కేతువును చూసి భయపడాల్సిన పనిలేదు. అది కేవలం త్యాగానికి మాత్రమే సూచిక కాదు, వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉన్న గ్రహం. క్రమం తప్పకుండా దైవారాధన, సాత్విక జీవనశైలి, సహనం పాటించడం ద్వారా కేతు మహాదశను జయించి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

