గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో అశుభ యోగాలను, శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కేతువు నీడ గ్రహం. కేతువు సంచారంలో మార్పు వస్తే ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మే 29, శుక్రవారం నాడు కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ఉదయం 10:16కి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కేతువు జూన్ 30 వరకు మఖ నక్షత్రం మూడవ పాదంలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత రెండో పాదంలోకి అడుగుపెడతాడు.
కేతువు సంచారం

కేతువు తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ దశను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. మఖా నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. అయితే కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టాలు వస్తాయి. మరి ఆ దురదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి? తెలుసుకుందాం.
కెరీర్, వ్యాపారంపై ప్రభావం
కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి చిక్కులు ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్, వ్యాపారంలో నెగిటివ్ ప్రభావాన్ని చూడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
కేతువు సంచారంతో ఈ రాశుల వారి కెరీర్‌లో ఇబ్బందులు... తస్మాత్ జాగ్రత్త!
1.మిథున రాశి
మిథున రాశి వారికి కేతువు నక్షత్ర సంచారంతో సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పురోగతి తగ్గుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికపరంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
2.కన్య రాశి
కన్య రాశి వారికి కేతువు సంచారం వలన సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా తెలియని వ్యక్తులను నమ్మకండి.
3.మీన రాశి
{{/usCountry}}కన్య రాశి వారికి కేతువు సంచారం వలన సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా తెలియని వ్యక్తులను నమ్మకండి.
3.మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారు ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీన రాశి వారు మాటల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. ప్రశాంతంగా, సహనంగా ఉంటే ఇబ్బందులు రావు.